బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా ప్రాంతీయ పార్టీలు

ABN , First Publish Date - 2021-12-31T05:46:48+05:30 IST

బీజేపీ చేతిలో ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు.

బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా ప్రాంతీయ పార్టీలు
ర్యాలీగా వెళ్తున్న తులసిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

 కాంగ్రె్‌సతోనే స్వర్ణాంధ్ర సాధ్యం 

జనజాగరణ అభియాన పాదయాత్రలో తులసిరెడ్డి 


హిందూపురం టౌన, డిసెంబరు 30: బీజేపీ చేతిలో ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. గురువారం హిందూపురంలో జనజాగరణ అభియాన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని ప్రధానవీధులగుండా పాదయాత్రగా వెళ్లి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కాంగ్రె్‌సపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు దొందు దొందేనన్నారు. ప్రభుత్వాల తీరువల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ప రం చేస్తూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. బీజేపీ కనుసన్నల్లోనే వైసీపీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. జగన్మోహనరెడ్డికి మాట తప్పడం, మడమతిప్పడం దినచర్యగా మారిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు మాయమాటలు చెప్పాడన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రా ష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగాయన్నారు. నిత్యావసర స రుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీ కొమ్ముకాస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం చెప్పడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సీమాంధ్ర స్వర్ణాంధ్రగా మారుతుందన్నారు. కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు సుధాకర్‌, అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి, పట్టణాధ్యక్షుడు శ్యామ్‌కిరణ్‌, షాహీద్‌, కలీం, తిమ్మారెడ్డి, హనుమంతరాయ ప్ప, ఆసిఫ్‌, జియా, హరిత తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T05:46:48+05:30 IST