అసైన్డ భూముల్లో ’రియల్‌ ’ దందా

ABN , First Publish Date - 2021-07-12T05:47:10+05:30 IST

జిల్లా కేం ద్రానికి కూత వేటు దూరంలో ఉన్న బుక్కరాయస ముద్రంలో భూ బకాసురులు బరి తెగిస్తున్నారు.

అసైన్డ భూముల్లో ’రియల్‌ ’ దందా
దేవరకొండ వద్ద అసైన్డ భూమిలో వెంచర్‌ వేసిన దృశ్యం

- యథేచ్ఛగా కాలువలు, వంకల  కబ్జా 

- కోట్లాది రుపాయుల...

   విలువైన ప్రభుత్వ భూములు మాయం 

- పుట్టుగొడుగల్లా... పుట్టుకొస్తున్న వెంచర్లు 

- పట్టించుకోని యంత్రాంగం 

బుక్కరాయసముద్రం జూలై11: జిల్లా కేం ద్రానికి కూత వేటు దూరంలో ఉన్న బుక్కరాయస ముద్రంలో భూ బకాసురులు బరి తెగిస్తున్నారు. ప్ర భుత్వ భూములే లక్ష్యంగా యథేచ్ఛగా కబ్జాలకు పా ల్పడుతున్నారు. మొదట సర్కారీ భూములను గా లిస్తారు. వెంటనే పక్కన ఉన్న రైతుల భూములను సంబంధిత యాజమానల నుంచి నయానో , భ యానో లాక్కొంటారు. ఆ తరువాత అందులోకి ప్ర భుత్వ భూమిని కలిపేసుకుని ప్లాట్లు వేసి విక్రయిస్తు న్నా. ప్రస్తుతం అనంతపురం- తాడిపత్రి ప్రధాన రహదారి పక్కనే ఉన్న బుక్కరాయసముద్రం చెరువు కింద ఎకరా స్థలం  దాదాపు రూ. 5కోట్ల నుంచి 6 కో ట్ల ధర పలుకుతోంది. అయితే గతంలో చెరువు కింద ఉన్న కాలువలు, తూములును యథేచ్ఛగా కబ్జా చే శారు. ఇప్పు వాటి ఆనవాళ్లు కూడా లేకుండా అక్ర మించి ఏకంగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు.  ఇదీ బుక్కరాయసముద్రం ప్రాంతంలో కొత్తదారులు  తొ క్కుతున్న రియల్‌ దందా తీరు. అధికారపార్టీ నాయకుల అండదండలతోనే ఇది సాగు తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

ప్రభుత్వ భూముల్లో పుట్టుకొస్తున్న వెంచర్లు 

జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న బు క్కరాయసముద్రంలో ప్రస్తుతం భూముల విలువ భారీగా పెరిగింది. దీంతో కొంత మంది రియల్‌ ఎ స్టేట్‌ వ్యాపారులు అసైన్డ భూముల పక్కనే ఉన్న ప్రైవేటు భూము లను కొనగొలు చేస్తున్నారు. వెంటనే ఆ రెం డింటినీ కలిపి వెంచర్లు వేసి విక్ర యాలు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా సర్వే నెం. 414 భూమినే చెప్పవచ్చు. బుక్కరాయసముద్రం దేవరకొం డ సమీపంలో  సర్వే నెం. 414లో ఎకరా అసైన్డ  భూమి ఉంది. దాని పక్కనే 415 సర్వే నెం.లో 5.08 ఎకరాల ప్రైవేటు భూమి ఉంది. దీనికి అసైన్డ భూ మి కలుపుకుని వెంచర్‌ వేస్తున్నారు. దాదాపు ఇక్కడ ఎకరా  భూమి ధర దాదాపు రూ.2కోట్ల నుంచి రూ. 3కోట్ల వరకు ఉంది.  ఇప్పటికే వెంచర్‌ వేసి చకా చకా పనులు సాగుతున్నాయి. 

చెరువు కింద కాలువలు, తూములు మాయం 

బుక్కరాయసముద్రం చెరువు కింద వందల ఎక రాల అయకట్టు భూమి ఉంది. సాగు భూమికి గ తంలో కిలో మీటర్ల మేర కాలువలు తవ్వారు. ప్ర భుత్వ నిధులుతో వాటి నిర్మాణాలు చేపట్టారు. అయి తే కొన్నేళ్లుగా అయ కట్టు భూమి సాగులో లేదు. ఇదే అదునుగా భావించిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు రైతుల వద్ద నుంచి భూములు కొనగోలు చేస్తున్నారు.  కాలువలు పూడ్చి, వారి భూముల్లోకి కలిపి ప్లాట్లుగా విక్రయించారు. బుక్కరాయసముద్రం ముసలమ్మ కట్ట వద్ద రెండేళ్ల క్రితం అనంతపురానికి చెందిన ఓ వైసీపీ నేత, రియల్‌ఎస్టేట్‌లో పేరు మోసిన వ్యక్తి దా దాపు చెరువుకు సంబంధించి 30 సెంట్ల కాలువలను పూడ్చి వేశాడు. వాటి స్థానంలో రోడ్లు వేసి, ప్లాట్లుగా విక్రయించాడు. దాదాపు ఇక్కడ ప్రస్తుతం సెంటు ధ ర రూ. 6లక్షల నుంచి రూ. 8 లక్షల వరుకు ధర ప లుకుతోంది.  ఇలా ఒకర్ని చూసి మరొకరు  చెరువు కాలువల కబ్జాకు పోటీ పడుతున్నారు. ఇలా  కాలు వలు, నీటి తూములను అక్రమించడం వలన భవి ష్యత్తులో పెను ప్రమాదం చోటు చేసుకునే అవ కా శం ఉందని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.  ప్రభుత్వ వ్యయం దాదాపు రూ. 50 ల క్షలతో చేపట్టిన కాలువలను పూడ్చివేయడంతో పా టు వాటి కబ్జా వల్ల దాదాపు కోట్లాది రూపాయలు ఆస్థిని ప్రభుత్వం నష్టపోవాల్సివస్తోంది. 

చోద్యం చూస్తున్న యంత్రాంగం 

మండల కేంద్రంలో కాలువలు, వంకలను య థేచ్ఛగా కబ్జా చేస్తున్నా రెవెన్యూ, గ్రామ పంచాయ తీ, ఇరిగేషన అధికారులు చోద్యం చూస్తున్నారని ఆ రోపణలు వినిపిస్తున్నాయి. సెంటు భూమి రూ.లక్షల్లో పలుకుతున్న చెరువు కింద కాలువ లను, భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు  మాయం చే స్తున్నారు. మరో వైపు అసైన్డ భూములలో వెంచర్లు వేస్తున్నారు.  అయినా అధికారులెవరూ పట్టించుకోలే దు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన అధికారులు సమన్వయంతో చెరువు కింద  అక్రమణకు గురైన నీటి కాలువలను తిరిగి నిర్మించి ప్రభుత్వ స్థలన్నా కాపాడాలని గ్రామ రైతులు కోరుతున్నారు. 

విచారణ చేసి  చర్యలు తీసుకుంటాం -భవ్య, ఇరిగేషన జేఈ  

బుక్కరాయసముద్రం చిక్కవడియార్‌ చెరువు కింద ఆక్రమణ కు గురైన నీటి కాలువలపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. చె రువుకు కాలువలు తప్పక ఉండాలి, లేకపోతే భవిష్యత్తులో పె నుప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కావున మండల తహసీల్దార్‌, పోలీసులకు ఇరిగేషన శాఖ తరుపున ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకుంటాం. 

అసైన్డ భూముల్లో వెంచర్‌ వేస్తే రిజిసే్ట్రషన్లు నిలిపేస్తాం
 - మహుబూబ్‌ బాషా, తహసీల్దార్‌
 అసైన్డ భూముల్లో వెంచర్‌ వేస్తే వారిపై చర్యలు తీసుకుని పక్కన భూమి రిజిస్ర్టేషన్లు నిలివేస్తాం. మండలంలో ఇలాంటి సంఘటనలను మా దృష్టికి తీసుకుని వస్తే విచారణ చేసి శాఖ పరమైన చర్యలు చేపడుతాం. వీటితో పాటు చెరువు కింద నీటి కాలువలు, వంకలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని అక్రమణలను తొలగిస్తాం. 

Updated Date - 2021-07-12T05:47:10+05:30 IST