ఇంటింటికీ రేషన పంపిణీ విఫలం

ABN , First Publish Date - 2021-07-12T05:54:39+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిం టికీ రేషన పంపిణీ కార్యక్రమం మండలంలో పూర్తిగా విఫలమైంది.

ఇంటింటికీ రేషన పంపిణీ విఫలం
రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న మినీ వాహనాలు


 పనిభారంతో మినీ వాహన డ్రైవర్ల రాజీనామా

 రేషన దుకాణాల్లోనే బియ్యం పంపిణీ

రాప్తాడు, జూలై 11: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిం టికీ రేషన పంపిణీ కార్యక్రమం  మండలంలో పూర్తిగా విఫలమైంది. ఇంటింటికీ రేషన పంపిణీ చేసే మి నీ వాహనాల డ్రైవర్లు పనిభారంతో రాజీనామా చేశారు. డ్రైవ ర్లు రాజీనామ లేఖను సీ ఎస్‌డీటీ కవితకు అందజేశారు. ఇంటింటికీ రేషన పంపిణీ చేయడం తమవ ల్ల కాదని తేల్చి చెప్పేశారు. రాప్తాడు మండల వ్యాప్తంగా ఇంటింటికీ రేషన పంపిణీకి 7 మినీ వాహనాలు కేటాయించారు. మొదటి రెండు నెలలు అవరోధాల న డుమ అతికష్టంగా మినీ వాహనాలను కాలనీల్లో ఒక చోట నిలబెట్టి అందరికీ రేషన పంపిణీ చేశారు. సర్వర్‌ సమస్యలు, పని భారం వలన ఇంటింటికీ రేషన పంపిణీ కష్టతరమైంది. ఆ తరువాత రేషన దుకాణాల వద్దే మినీ వాహనాలు నిలబెట్టి రేషన పంపిణీ చేశారు. ఇంటింటికీ రేషన పంపిణీ ఇక తమ వల్ల కాదని రాజీనామ లేఖను సీఎస్‌డీటీకి అందజేసి మినీ వాహనాలను కొన్నాళ్లు ఎంపీడీఓ కార్యాలయం లో ఉంచారు. ఆ తరువాత డైవ్రర్లకు అఽధికారులు సర్దిచెప్పడంతో మళ్లీ కొన్నాళ్లు అరకొరగా పంపిణీ చేశారు. ఆ తరువాత ఐగురురు డ్రైవర్లు మేము ఇక వాహనాలు నడపమని రాజీనామ లేఖను సీఎస్‌డీటీకి అందించి వాహనాలను రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయంలో ఉంచారు. మిగతా రెండు మినీ వాహనాలు రేషన డోర్‌డెలివరీ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆ రెండు మినీ వాహనాలు కూడా ఇంటింటికీ పంపిణీ చేయలేదని, వాహనాలు వాళ్ల ఇంటి వద్దే ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన మినీ వాహనాలు కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉంచారని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై సీఎస్‌డీటీని వివరణ కోరగా మండలానికి 7మినీ వాహనాలు కేటాయించగా అందులో ఐదుగురు డ్రైవర్లు రాజీనామ చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-07-12T05:54:39+05:30 IST