రామచంద్ర సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-05-19T05:03:57+05:30 IST

కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో శ్రీయోగి నారాయణసేవా సమితి కార్యదర్శి రామచంద్ర చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలుపేర్కొన్నారు.

రామచంద్ర సేవలు చిరస్మరణీయం
రామచంద్ర చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

హిందూపురం టౌన, మే 18: కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో శ్రీయోగి నారాయణసేవా సమితి కార్యదర్శి రామచంద్ర చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలుపేర్కొన్నారు. కరోనాబారినపడి ఈనెల 16న మృతిచెందిన రామచంద్ర చిత్రపటానికి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా యోగినారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో రవిశంకర్‌, ఆర్టీసీ జగదీశ, రాము, ఉమేష్‌, మాట్లాడుతూ సేవా సమితి ఆధ్వర్యంలో గత యేడాది ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని ఈ యేడాదికూడా పట్టణంలో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిశేషు, మధు, అశోక్‌, రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-19T05:03:57+05:30 IST