చిలమత్తూరులో వర్షం

ABN , First Publish Date - 2021-07-08T06:04:13+05:30 IST

మండలంలో మంగళవారం రాత్రి 55.5 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.

చిలమత్తూరులో వర్షం

చిలమత్తూరు, జూలై 7: మండలంలో మంగళవారం రాత్రి 55.5 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. గత నెల రోజులుగా మంచి వర్షం కోసం ఎదురుచూసిన రైతులు ఈ వర్షంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం అరకొరగా కురిసిన వర్షానికే వేరుశనగ విత్తనాలు విత్తుకొన్నారు. అయితే అవి సరిగా మొలకరాకపోవడంతో వర్షం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. అదేవిధంగా చాలా మంది మంది రైతులు మంచి పదునుకోసం ఎదురుచూస్తూ విత్తనాలు విత్తే కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. 


Updated Date - 2021-07-08T06:04:13+05:30 IST