రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దుండగుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-12-08T05:47:02+05:30 IST

రైళ్లలో ప్రయాణికుల సొత్తును చోరీ చేస్తున్న దుండగుడిని జీఆర్పీ పోలీసు లు అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం జీ ఆర్పీ ఎస్పీ అనిల్‌బాబు కేసు వివరాలను వెల్లడించారు.

రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దుండగుడి అరెస్టు

62.8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

గుంతకల్లు, డిసెంబరు 7: రైళ్లలో ప్రయాణికుల సొత్తును చోరీ చేస్తున్న దుండగుడిని జీఆర్పీ పోలీసు లు అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం జీ ఆర్పీ ఎస్పీ అనిల్‌బాబు కేసు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట పరిధి సలీం నగర్‌కు చెందిన ఉమేద్‌ అలీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని ఏసీ బోగీల్లో రిజర్వేషన చేసుకుని, ప్రయాణిస్తుండేవాడు. రాత్రిళ్లు నిద్రపోయిన మహిళల మెడల్లోని ఆభరణా లు, వారి బ్యాగులను అపహరించేవాడు. వీటిపై ఫిర్యాదులు రావడంతో దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ని యమించారు. రాబడిన సమాచారం మేరకు మంగళవారం ఈ బృందం సభ్యులు గుంతకల్లు రైల్వే స్టేషనలో ఉమేద్‌ అలీని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.30 లక్షల విలువైన 628 గ్రాముల బంగారు నగ లు, సెల్‌ఫోన స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గుంతకల్లు, గుత్తిలో రెండు, రేణిగుంటలో మూడు, ధ ర్మవరం, నంద్యాల, హిందూపురం, కదిరి, కావలి, నె ల్లూరు, కాచిగూడ స్టేషన్ల పరిధిలో ఒక్కో చోరీ చేశాడని ఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టుచేసి, భా రీ స్థాయిలో నగలను స్వాధీనపరచుకున్న స్పెషల్‌ టీం సభ్యులు గుంతకల్లు జీఆర్పీ సీఐ నగేశబాబు, రేణిగుంట సీఐ రామకృష్ణ, ఆర్పీఎఫ్‌ ఇనస్పెక్టర్‌ బెన్నయ్యను ఎస్పీ ప్రశంసించారు. సమావేశంలో నెల్లూరు జీఆర్పీ ఎస్పీ మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T05:47:02+05:30 IST