త్వరలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి: డీఆర్‌ఎం

ABN , First Publish Date - 2021-08-10T06:20:53+05:30 IST

రైల్వే డివిజనలో ఉన్న ప్రాజెక్టు లు సంవత్సర కాలంలో పూర్తవుతాయని డీఆర్‌ఎం అలోక్‌ తి వారి పేర్కొన్నారు.

త్వరలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి: డీఆర్‌ఎం
డీఆర్‌ఎం అలోక్‌ తివారి

గుంతకల్లు, ఆగస్టు 9:  రైల్వే డివిజనలో ఉన్న ప్రాజెక్టు లు సంవత్సర కాలంలో పూర్తవుతాయని డీఆర్‌ఎం అలోక్‌ తి వారి పేర్కొన్నారు. సోమవారం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుత్తి-ధర్మవరం డబ్లిం గ్‌, విద్యుద్దీకరణ పనులు నవంబరుకు, ధర్మవరం-పాకాల  ప నులు మార్చికల్లా పూర్తఅవుతాయన్నారు. గుంతకల్లు వద్ద బై పాస్‌ లైన నిర్మాణానికి కొత్త అంచనాలు తయారుచేసి పంపామని తెలిపారు. ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులకు అనుమతులు వ చ్చే అవకాశాలు లేవన్నారు. ప్రతి కి.మీ. రైల్వే లైనకు రూ.15 కోట్ల దాకా ఖర్చవుతున్న పరిస్థితుల్లో కొత్త లైన్ల నిర్మాణం చేపట్టడం కష్టతరమన్నారు. ధర్మవరం-పాకాల డబ్లింగ్‌ లైన నిర్మాణం వల్ల రైల్వే డివిజనకు పెద్దగా ఉపయోగం లేనందున దాని ప్రతిపాదన లేదన్నారు. మరో  రెండు రోజుల్లో తాను బదిలీపై వెళ్లనున్నట్లు తెలియజేశారు. 

Updated Date - 2021-08-10T06:20:53+05:30 IST