రైల్వే వంతెన సమస్య పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-12-09T05:52:17+05:30 IST

కొత్తచెరువు, పెనుకొండ రహదారిలోని రైల్వే అం డర్‌ బ్రిడ్జి సమస్యను పరిష్కరించాలంటూ విద్యార్థులు, పలు గ్రామాల ప్రజలు రైల్వే ట్రాక్‌పై బుధవారం బైఠాయించి నిరసన తెలిపారు.

రైల్వే వంతెన సమస్య పరిష్కరించండి

అండర్‌ బ్రిడ్జిలో ఆగిన వర్షపు నీరు 

పొలాల్లో వెళ్లకుండా రహదారిని మూసిన రైతు 

23 గ్రామాలకు రాకపోకలు బంద్‌ 

ట్రాక్‌పై బైఠాయించి విద్యార్థులు, గ్రామస్థుల నిరసన

కొత్తచెరువు, డిసెంబరు 8: కొత్తచెరువు, పెనుకొండ రహదారిలోని రైల్వే అం డర్‌ బ్రిడ్జి సమస్యను పరిష్కరించాలంటూ విద్యార్థులు, పలు గ్రామాల ప్రజలు రైల్వే ట్రాక్‌పై బుధవారం బైఠాయించి నిరసన తెలిపారు. కొత్తచెరువు సమీపంలోని రైల్వే ట్రాక్‌ ఏర్పాటు చేయడంతో సుమారు 23 గ్రామాలకు వాహనాల రాకపోకలు కట్‌ అయ్యాయి. దీంతో అక్కడ ప్లైఓవర్‌ నిర్మించాలని ఆ గ్రామస్థులు డిమాండ్‌ చే శారు. అయితే దాన్ని నిర్మిస్తే తమ పొలాలు పోతాయని భావించిన అక్కడి రైతులు ఆ నిర్మాణానికి  అంగీకరించకపోవడంతో  రైల్వే అండర్‌ బ్రిడ్జి ని ర్మించారు. దీంతో ఆ మార్గం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, ఉద్యోగుల వా హనాలతో పాటు కియా బస్సులూ వెళ్లేవి. కాగా ఇటీవల కురిసిన వర్షానికి ఆ బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఆ 23 గ్రామాలకూ వాహనాల రాకపోకలు మళ్లీ ఆగిపోయాయి. అటు వైపు వెళ్లాలంటే సుమారు 20 కిలోమీటర్లు చుట్టువేసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. కాగా విద్యార్థులు, గ్రామస్థులు తప్పని పరిస్థితుల్లో ద్విచక్రవాహనాల్లో ట్రాక్‌ను దాటుకొని వెళ్లేవారు. ఈ నేపథ్యంలో తన పొలం ద్వారా వెళ్లే రహదారిని ఓ రైతు మూడు రోజుల క్రితం మూసివేశాడు. దీంతో ద్విచక్రవాహనాలు సైతం వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. విద్యార్థులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు కిలోమీటర్‌ నడుచుకుంటూ కొత్తచెరువుకు చేరుకునేవారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ వారు బుధవారం ఆ ట్రాక్‌పై బైఠాయించి నిరసన తెలిపారు. ఎవరైనా అనారోగ్యాలకు గురైతే ఆసుపత్రికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉందని వాపోయారు. ఈ సమస్య ను పలుమార్లు పాలకులు, అధికారుల దృష్టికీ తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. 


Updated Date - 2021-12-09T05:52:17+05:30 IST