సోలార్‌ ట్రీని ఆవిష్కరించిన పీవీకేకే విద్యార్థులు

ABN , First Publish Date - 2021-10-31T05:51:28+05:30 IST

పీవీకేకే ఇం జనీరింగ్‌ కళాశా లలో బీటెక్‌ చివరి సంవత్సరం ఈఈ ఈ విద్యార్థులు సో లార్‌ ట్రీని శనివా రం ఆవిష్కరించా రు.

సోలార్‌ ట్రీని ఆవిష్కరించిన పీవీకేకే విద్యార్థులు
సోలార్‌ ట్రీని చూపుతున్న విద్యార్థులు


అనంతపురంరూరల్‌, అక్టోబరు30: పీవీకేకే ఇం జనీరింగ్‌ కళాశా లలో బీటెక్‌ చివరి సంవత్సరం ఈఈ ఈ విద్యార్థులు సో లార్‌ ట్రీని శనివా రం ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆ విభాగాధిపతి మహేశకుమార్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యుత కొరత కనిపిస్తోందన్నారు. మున్ముందు ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయన్నారు. వినియోగదారులు, రైతులు ప్రస్తుతం వస్తున్న విద్యుత బిల్లులతో భయాందోళన చెందుతున్నారన్నారు.  వీటన్నిటి పరిష్కారం కోసం విద్యార్థులు సోలార్‌ ట్రీని ఆవిష్కరించారన్నారు. సాధారణ సోలార్‌ ప్యానల్‌ ఏర్పాటు చేయాలన్నా స్థలం ఎక్కువగా అవసరం అవడంతో పాటు ఖర్చుతో కూడుకున్నదన్నారు. ఈ సోలార్‌ ట్రీకి స్థలం ఎక్కువగా అవసరం ఉండదన్నారు. తక్కువ స్థలంలోనే అధిక ఓల్టుల విద్యుత ఉత్పత్తిచేసుకోవచ్చున్నారు. కరెంటు బిల్లుల బాధలు తగ్గుతాయన్నారు. 


Updated Date - 2021-10-31T05:51:28+05:30 IST