పోలింగ్‌ బూతల వద్ద బందోబస్తు

ABN , First Publish Date - 2021-11-02T05:55:38+05:30 IST

పెనుకొండలో ఈ నెల 15న పెనుకొండ నగర పాలక పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ బూతలవద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాల ని డీఎస్పీ రమ్య పేర్కొన్నారు.

పోలింగ్‌ బూతల వద్ద బందోబస్తు
పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ

పెనుకొండ టౌన, నవంబరు 1: పెనుకొండలో ఈ నెల 15న పెనుకొండ నగర పాలక పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ బూతలవద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాల ని డీఎస్పీ రమ్య పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ, వెంకటరెడ్డిపల్లి, కోనాపురం తదితర గ్రామాల్లోని పోలింగ్‌ బూతలలో పరిశీలించారు. ఈ క్రమంలో ఓటర్లకు అనుకూలంగా ఉన్నాయా లేదా, తదితర వాటిని పోలింగ్‌కు వచ్చే రహదారుల గురించి ఆరాతీశారు. జరుగనున్న ఎన్నికలకు గట్టిబందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రమే్‌షబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-02T05:55:38+05:30 IST