మెరుగైన వైద్య సేవలు అందించండి : మంత్రి

ABN , First Publish Date - 2021-08-21T06:04:54+05:30 IST

ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని రోడ్డు భవనాలశాఖ మంత్రి శంకర్‌నారాయణ వైద్యులను ఆదేశించారు.

మెరుగైన వైద్య సేవలు అందించండి : మంత్రి
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న మంత్రి శంకర్‌ నారాయణ

పెనుకొండ, ఆగస్టు 20: ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని రోడ్డు భవనాలశాఖ మంత్రి శంకర్‌నారాయణ వైద్యులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన మంత్రి ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన సమస్యల గురించి సూపరింటెండెంట్‌ బాబుబడేన, వైద్య సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి కొత్తగా మంజూరైన కొవిడ్‌ ఆక్సిజన బెడ్‌లు ఆక్సిజన ప్లాంట్‌ నిర్మాణ పనులను గురించి విచారించారు. సమావేశంలో వైద్యులు బాబుబుడేన, మోహనబాబు, కమిటీ సభ్యులు కొండలరాయుడు, ఇర్షాద్‌బాష, సుశీలమ్మ, ఫార్మసిస్ట్‌ శ్రీనివాసులు, హెడ్‌నర్స్‌ సుభాషిణి, కోటిప్రసాద్‌, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-21T06:04:54+05:30 IST