ఘనంగా ముత్యాలపల్లకీ ఉత్సవం

ABN , First Publish Date - 2021-03-22T05:54:02+05:30 IST

మండలంలోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో వెలసిన మద్దానేశ్వరస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ము త్యాలపల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ముత్యాలపల్లకీ ఉత్సవం
ముత్యాలపల్లకీలో ఊరేగుతున్న స్వామివారు

రాయదుర్గం రూరల్‌, మార్చి 21 : మండలంలోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో వెలసిన మద్దానేశ్వరస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ము త్యాలపల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, వ స్త్రాలంకరణ, పుష్పాలంకరణ పూజలు కొ నసాగాయి. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షు లు బసవరాజు తెలిపారు. రాత్రి 7 గంటలకు స్వామివారి ప్రతిమను ముత్యాలపల్లకీలో కొలువుదీర్చి ఆలయం వద్ద నుంచి పాదకట్ట వరకు ఊరేగించారు. మేళతాళాలు, డప్పువాయిద్యాలు, యువకుల నృత్యాల నడుమ ఉత్సవం వైభవంగా సాగింది. ప్రభుత్వ విప్‌ కా పు రామచంద్రారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.  


Updated Date - 2021-03-22T05:54:02+05:30 IST