ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం

ABN , First Publish Date - 2021-11-02T06:21:07+05:30 IST

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో రాషా్ట్రవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ అనిల్‌బాబు... అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారరు.

ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
తాడిపత్రిలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కౌన్సిల్‌ సభ్యులతో మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి నివాళి

గుంతకల్లు, నవంబరు 1: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో రాషా్ట్రవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ అనిల్‌బాబు... అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారరు. ఎస్పీ మాట్లాడుతూ సమైక్య రాష్ట్ర అవతరణకు ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం గొప్పదని, ఆయన్ను ప్రతి అంధ్రుడూ గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నా రు. తెలుగు భాషను మాట్లాడేవారందరూ ఒక రాష్ట్రంలో ఉండాలన్న తలంపుతో పొట్టి శ్రీరాములు కొన ఊపిరివర కూ పోరాడారన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కార్యాలయ ఏఓ శ్రీనివాసరావు, ఆర్‌ఐ రామాంజనేయులు, ఎస్‌ఐలు సురేశబాబు, బీ వెంకట రమణ, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధం గా అవోపా సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి చాంబర్‌ ఆఫ్‌ కామర్సు జిల్లా అధ్యక్షుడు గోపా జగదీశ, కౌన్సిలరు కృపాకర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మేడా ప్రహ్లాద, మేడా వెంకటేశు, సోమనాథ్‌, చెన్నకేశవులు, సుదర్శన పాల్గొన్నారు.


గుంతకల్లు టౌన: మండలంలోని నక్కనదొడ్డి అంగనవాడీ  కేంద్రంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. చిన్నారులు భరతమాత వేషధా రణలో అలంరించారు. పిల్లలకు ఆట పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పుష్పావతి, అంగనవాడీ టీచర్లు పద్మజ, బాలథెరిస్సా, శాంత, విజయ పాల్గొన్నారు.


ఉరవకొండ : పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి   సోమవారం సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు ప్రాణ త్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రం తెలంగా ణ, ఏపీగా విడిపోయిందన్నారు. అలాగే జడ్పీటీసీ పార్వత మ్మ, ఎంపీపీ చంద్రమ్మ, సర్పంచు లలితమ్మలు పొట్టి శ్రీరాములు విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ సీడీపీవో రామాంజినమ్మ, ఎస్సీ, ఎస్టీ ఉ ద్యోగ సంఘం నాయకులు ఆనందరాజు పాల్గొన్నారు. 


బొమ్మనహాళ్‌: మండలంలోని బొమ్మనహాళ్‌, ఉద్దేహాళ్‌, నేమకల్లు గ్రామ ప్రభుత్వ పాఠశాలల్లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, సర్పంచలు పరమేష్‌, కరూరు కవిత, ముక్కన్న, ముల్లంగి భారతి తదితరులు పాల్గొన్నారు. 


పుట్లూరు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎంపీపీ రాఘవరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవల ను కొనియాడారు. కార్యక్రమం లో సర్పంచ పాల్గొన్నారు.


యల్లనూరు: స్థానిక గ్రంథాలయంలో లైబ్రేరియన ప్ర కా్‌షరెడ్డి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.


తాడిపత్రి: పట్టణ పోలీ్‌సస్టేషన సర్కిల్‌లోని అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిల్‌ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.   తెలుగువారందరికి ఒకే రాష్ట్రం ఏర్పాటుచేయాలంటూ అమరణ నిరాహారదీక్ష చేసి అమరుడైన పొ ట్టి శ్రీరాములు చిత్తశుద్ధిని కొనియాడారు. ఆయన త్యాగఫలితం వల్లే  ఆంధ్రప్రదేశ ఏర్పడిందని తెలిపారు. 


తాడిపత్రి టౌన: పట్టణంలోని గాంధీసర్కిల్‌లో ఉన్న పొ ట్టిశ్రీరాములు విగ్రహానికి పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కత్తి లక్ష్మినారాయణరెడ్డి, సభ్యులు, కాంగ్రె్‌సపార్టీ ఇనచార్జ్‌ సూర్యనారాయణరెడ్డి వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఆయన చేసిన పోరాటాల గురించి వివరించారు.


 కుందుర్పి: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఈశ్వరమ్మ, సిబ్బంది, మండలంలోని కరిగానిపల్లి మం డల పరిషత ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సంగప్పలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


వజ్రకరూరు: స్థానిక తహసీల్దారు కార్యాలయంలో   త హసీల్దారు ఎస్పీ శ్రీనివాసులు, గ్రంథాలయాధికారి మునె మ్మ ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.  


కళ్యాణదుర్గం: అమరజీవి పొట్టిశ్రీరాములు పోరాట ఫలితంగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణకు నాంది పలికిందని టీ డీపీ సీనియర్‌ నాయకులు చౌళం మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం స్థానిక జేఏసీ కార్యాలయంలో పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు పాపంపల్లి రామాంజనేయులు, శ్రీనివాసరెడ్డి, కొల్లాపురప్ప, గొర్ల గోవిందరాజు, హనుమంతరెడ్డి, ఒంటిమిద్ది సత్తి, మల్లిపల్లి నారాయణ, సర్మస్‌, షామీర్‌, మోరేపల్లి రాము, మంజునాథ్‌రెడ్డి, వెంకటరమణ, సన్న య్య, రాము, రామ్మూర్తి చౌదరి, ఊటంకి తిమ్మరాజు పాల్గొన్నారు. 


 ఎన్టీఆర్‌ భవనలో... స్థానిక ఎన్టీఆర్‌ భవనలో అమరజీవి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ కన్వీనర్‌ మాదినేని మురళి, పార్లమెంట్‌ కార్యదర్శి సత్యప్ప, అధికార ప్రతినిధి రామరాజు, కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు, నా యకులు ఆంజినేయులు, రామ్మోహన, గంగన్న, దండాశ్రీరాముడు, కిష్టప్ప, డిష్‌ రమణ, కామక్కపల్లి నాగరాజు, శీన, బిక్కి గోవిందరాజులు, బ్రిజే్‌షచౌదరి, పెద్దన్న, పాపన్న, ఓ బులేష్‌, శివాయాదవ్‌, చెనమల్ల, బొమ్మయ్య, శ్రీధర్‌, హరి, రామకృష్ణనాయక్‌, ఎర్రిస్వామి, పరమేష్‌, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-02T06:21:07+05:30 IST