ప్రొటోకాల్‌ అమలేది?

ABN , First Publish Date - 2021-07-12T06:07:58+05:30 IST

మండలంలోని రా యలచెరువు సచివాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ పేరు మాయమైంది.

ప్రొటోకాల్‌ అమలేది?
శిలాఫలకంలో కనిపించని పంచాయతీ కార్యదర్శి పేరు

శిలాఫలకంలో పంచాయతీ కార్యదర్శిపేరు లేకపోవడంపై విమర్శలు


యాడికి, జూలై 11: మండలంలోని రా యలచెరువు సచివాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ పేరు మాయమైంది. ఎమ్మె ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఈ భవనా న్ని ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, ఇత ర అధికారుల పేర్లు అన్నీ ఉన్నా, కేవలం పంచాయతీ కార్యదర్శి పేరు లేకపోవడంపై పీఆర్‌ సిబ్బందిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశ పూర్వకంగానే ఇలా చే శారన్న ఆరోపణలు పంచాయతీ సిబ్బంది నుంచి వినిపిస్తున్నాయి. ప్రొటోకాల్‌ ప్రకారం పంచాయతీ కార్యదర్శి పేరు శిలాఫలకంలో ఉండాలి. కానీ ఆ నిబంధన ఎందుకు అమలు చేయలేదని పలువురు   ప్రశ్నిస్తున్నారు. సచివాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంలో పంచాయతీ కార్యదర్శి పేరు లేకపోవడంపై ఎంపీడీఓ కొండయ్యను వివరణ కోర గా ఇదిమాకు సంబంధం లేని విషయం అని అన్నారు. దీని నిర్వహణ బా ధ్యత అంతా పీఆర్‌ ఇంజనీర్లది అని పేర్కొన్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-07-12T06:07:58+05:30 IST