బకాయి వేతనాల కోసం నిరసన
ABN , First Publish Date - 2021-07-08T06:26:17+05:30 IST
తమకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు.

కూడేరు, జూలై 7 : తమకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. ఈ నిరసనకు మద్ధతు తెలిపిన సీపీఐ మండల కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ... కార్మికులు సమ్మెలో వెళ్తే... జిల్లా వ్యాప్తంగా 900 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా బకాయి వేతనాలు చెల్లించాలని అన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు.