పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలపై నిరసన
ABN , First Publish Date - 2021-10-29T05:57:29+05:30 IST
పెట్రోల్, డీజల్ రేట్ల పెంపుతో ఉపాధి కోల్పోతున్నామని ఆగ్రహిస్తూ గురువారం మండలంలోని రాయలచెరువులో జా తీయ రహదారిపై లారీల యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు.

జాతీయ రహదారిపై బైఠాయించిన లారీ యజమానులు, డ్రైవర్లు
యాడికి, అక్టోబరు 28: పెట్రోల్, డీజల్ రేట్ల పెంపుతో ఉపాధి కోల్పోతున్నామని ఆగ్రహిస్తూ గురువారం మండలంలోని రాయలచెరువులో జా తీయ రహదారిపై లారీల యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. రో డ్డుపై బైఠాయించి లారీల రవాణాను అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువు రు లారీల యజమానులు, డ్రైవర్లు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజల్ రేట్లను రోజురోజుకు పెంచుకుంటూపోతున్నాయని ఆందోళ న వ్యక్తంచేశారు. అధిక రేట్లను భరించలేక లారీలను నిలిపివేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌చేశారు. అంతవరకు పోరాడుతామని హెచ్చరించారు. కాగా పోలీసులు స ర్దిచెప్పడంతో నిరసన విరమించారు.
గుంతకల్లు టౌన: డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని గుంతకల్లు లారీ ఓనర్స్ అసోసియేషన అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. పట్టణంలోని హనుమాన సర్కిల్ వద్ద గురువారం అసోసియేషన ఆధ్వర్యంలో ధర్నా చే పట్టారు. రోజురోజుకు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. పెరిగిన ధరలతో వాహనాలు తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే ధరలు తగ్గించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణా నాయ క్, ఎస్వీఆర్ శీన, శ్రీధర్, ఇమామ్ సాబ్, సభ్యులు పాల్గొన్నారు.