త్రైత సిద్ధాంత భగవద్గీతపై ప్రచారం
ABN , First Publish Date - 2021-10-04T05:27:51+05:30 IST
ప్రతి మానవుడు తాను చేసిన కర్మ ప్రతిఫలాన్ని తప్పక అనుభవిస్తాడని కర్మయోగం విశిష్టత గురించి తెలియజేసేది త్రైత సిద్ధాంత భగవద్గీత మాత్రమేనని హిందూ ధర్మ ప్రచార ప్రబోదసేవా సమితి తెలియజేసింది.
గోరంట్ల, అక్టోబరు 3: ప్రతి మానవుడు తాను చేసిన కర్మ ప్రతిఫలాన్ని తప్పక అనుభవిస్తాడని కర్మయోగం విశిష్టత గురించి తెలియజేసేది త్రైత సిద్ధాంత భగవద్గీత మాత్రమేనని హిందూ ధర్మ ప్రచార ప్రబోదసేవా సమితి తెలియజేసింది. ప్రబోద సేవాసమితికి చెందిన అనేక మంది గోరంట్లలో ఆదివారం పర్యటిస్తూ త్రైత సిద్ధాంత భగవద్గీత గురించి ప్రచారం చేశారు. కొత్త చెరువు, ముదిగుబ్బ, ధర్మవరం, తుంపర్తి, ఉంట్లవారిపల్లికి చెందిన కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మల విషయాన్ని శాస్ర్తీయంగా తెలుసుకోవడానికి భగవంతుడు అందించిన ఏకైక జ్ఞానమార్గం భగవద్గీతగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత జ్ఞానబోధ సంబంధిత పుస్తకాలను పంపిణీ చేశారు.