పలువురికి ఉద్యోగోన్నతి
ABN , First Publish Date - 2021-10-20T06:05:37+05:30 IST
అటవీశాఖలో పలువురిని ఉద్యోగోన్నతిపై బదిలీ చేస్తూ జిల్లా అటవీశాఖాధికారి సందీప్ కృపాకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం రైల్వే, అక్టోబరు 19 : అటవీశాఖలో పలువురిని ఉద్యోగోన్నతిపై బదిలీ చేస్తూ జిల్లా అటవీశాఖాధికారి సందీప్ కృపాకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరుట్ల నార్త్ బీట్ అధికారి నారపరెడ్డిని ఆత్మకూ రు సెక్షన అధికారిగా, కళ్యాణదుర్గం అసిస్టెంట్ బీట్ అధికారి మారెప్పను అనంతపురం బీట్ అధికారిగా, శెట్టూరు అసిస్టెంట్ బీట్ అధికారి రాజేశ్వరిని కదిరి రేంజ్ బీట్ అధికారిగా ఉద్యోగోన్నతిపై బదిలీ చేశారు.