బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిషేధం : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-12-31T06:07:09+05:30 IST

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఈనెల 31న శుక్రవారం అర్ధరాత్రి చేపట్టే వేడుకలకు పోలీసు శాఖ ఆంక్షలు విధించిం ది. బహిరంగ ప్రదేశాల్లో జన సమూహంతో సంబరాలకు అనుమతి లేదని స్ప ష్టం చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిషేధం : డీఎస్పీ

గుంతకల్లు టౌన/కళ్యాణదుర్గం/తాడిపత్రి టౌన/పెద్దవడుగూరు/ఉరవకొండ/వజ్రకరూరు/కుందుర్పి/యాడికి/బెళుగుప్ప/యల్లనూరు/రాయదుర్గం రూరల్‌, డిసెంబరు 30: కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఈనెల 31న శుక్రవారం అర్ధరాత్రి చేపట్టే వేడుకలకు పోలీసు శాఖ ఆంక్షలు విధించిం ది. బహిరంగ ప్రదేశాల్లో జన సమూహంతో సంబరాలకు అనుమతి లేదని స్ప ష్టం చేశారు. ఈమేరకు గురువారం గుంతకల్లు, కళ్యాణదుర్గం డీఎస్పీలు నరసింగప్ప, ఆంతోనప్ప వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియెంట్‌ ఒమైక్రాన వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తె లిపారు. 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉంటుందన్నారు. సాధ్యమైనంత వర కు వేడుకలను కుటుంబసభ్యులతో నిర్వహించుకోవాలని సూచించారు. కాగా ప్రభుత్వ నిబంధనల మేరకు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాల ని తాడిపత్రి పట్టణ, పామిడి రూరల్‌, రాయదుర్గం అర్బన సీఐలు కృష్ణారెడ్డి, ర విశంకర్‌రెడ్డి, సురే్‌షబాబు, పెద్దవడుగూరు, ఉరవకొండ, వజ్రకరూరు, కుందు ర్పి, బెళుగుప్ప, యల్లనూరు ఎస్‌ఐలు రాజశేఖర్‌రెడ్డి, రమేష్‌ రెడ్డి, టీపీ వెంకటస్వామి, కృష్ణమూర్తి, రుషేంద్రబాబు, రవికిరణ్‌లు వేర్వేరు ప్రకటనలు విడుదల చేస్తూ పట్టణ, మండల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్ర త్యేక నిఘా, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. డ్రంకెన డ్రైవ్‌, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై స్పెషల్‌ డ్రైవ్‌ ఉంటుందన్నారు. అనుమతి లేని ప్రదేశాల్లో మద్యం తాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి దండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చి బయటకు పంపకుండా తగిన జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు.

                       

 వ్యాపారస్తులు, మద్యం దుకాణాదారులు నిర్ణీ త సమయంలోపు దుకాణాలు మూసి వేయాలన్నారు. 30 పోలీసు యాక్ట్‌ అ మలులో ఉండడంతో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడడం, ప్రదర్శన లు, రోడ్లపై కేక్‌ కట్‌ చేయడం వంటివి చేయరాదన్నారు. ద్విచక్రవాహనాల సై లెన్సర్లు తొలగించి రోడ్లపై తిరిగి ఇతరులను ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ చేపట్టే వేడుక ల్లో ఎలాంటి అపశృతులు దొర్లకుండా, శాంతిభద్రతలకు భంగం కలగకుండా, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పోలీసులతో అందరూ సహకరించాల ని పోలీసులు విజ్ఞప్తి చేశారు.   


Updated Date - 2021-12-31T06:07:09+05:30 IST