పూజారి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-20T06:10:17+05:30 IST

మండలంలోని ఎన ఎనుములవారిపల్లి సమీపంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పూజారి జ్యోతిస్వరూపానంద స్వా మి (62)

పూజారి ఆత్మహత్య

నల్లమాడ, మే 19 : మండలంలోని ఎన ఎనుములవారిపల్లి సమీపంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పూజారి జ్యోతిస్వరూపానంద స్వా మి (62) బుధవారం పుల్లగూర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ రామాం జనేయులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూజారి జ్యోతి స్వరూపానందస్వామి ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వారు. అయితే ఆయన ఒంటరిగా 20 సంవత్సరాల నుంచి ఎన ఎనుములవారిపల్లి సమీపంలోని  నరసింహస్వామి ఆలయ పూజారిగా ఉండేవాడు. గత రెండేళ్ళ క్రితం ఆయనకు పక్షవాతం సోకడంతో కాళ్ళు, చేతులు పనిచేయకుండా సచ్చుపడ్డాయి. కొన్ని రోజుల తర్వాత ప్రమా దవ శాత్తూ జారిపడటంతో ఆయన కాలు విరిగింది. అనంతపురం, తాడిపత్రి ఆసుప త్రులలో వైద్య చికిత్సలు చేయించుకున్నా ఫలితం లేక పోయింది. ఒంటరి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాసి చనిపోయినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు. మృతునికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-05-20T06:10:17+05:30 IST