వైసీపీ నాయకుల కబ్జాలను అడ్డుకోండి

ABN , First Publish Date - 2021-12-28T05:54:17+05:30 IST

కుందుర్పి మండలకేంద్రంలో దివ్యాంగు ల సౌకర్యార్థం కేటాయించిన 10 సెంట్ల స్థలాన్ని స్థానిక వైసీపీ నాయకులు క బ్జాకు యత్నిస్తున్నారని దివ్యాంగుల సంఘం నాయకులు ఆరోపించారు.

వైసీపీ నాయకుల కబ్జాలను అడ్డుకోండి
ధర్నా చేస్తున్న దివ్యాంగులు

ఆర్డీఓ కార్యాలయం ఎదుట దివ్యాంగుల ఆందోళన  


కళ్యాణదుర్గం, డిసెంబరు 27: కుందుర్పి మండలకేంద్రంలో దివ్యాంగు ల సౌకర్యార్థం కేటాయించిన 10 సెంట్ల స్థలాన్ని స్థానిక వైసీపీ నాయకులు క బ్జాకు యత్నిస్తున్నారని దివ్యాంగుల సంఘం నాయకులు ఆరోపించారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు ఉద్దీప్‌ సింహ, రాజేష్‌, చెన్నమల్లప్ప మాట్లాడారు.   పదిరోజులుగా కుందుర్పి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టి నా అధికారుల్లో చలనం లేదని వాపోయారు. 2018లో పట్టా పొందామని, ఆస్థలంలో భవన నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానిక వైసీపీ నాయకులు అడ్డుకుని కబ్జాకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవె న్యూ అధికారులకు కూడా వారికే వంతు పాడుతున్నారని ఆరోపించారు. అ నంతరం ఆర్డీఓ నిశాంతరెడ్డి నిరసనకారులతో ఫోనలో మాట్లాడారు. న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.  


Updated Date - 2021-12-28T05:54:17+05:30 IST