హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం

ABN , First Publish Date - 2021-11-26T06:14:34+05:30 IST

నియోజకవర్గంలో నాలుగు హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. 7.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు.

హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం
దెబ్బతిన్న కల్వర్టును పరిశీలిస్తున్న మంత్రి శంకరనారాయణ

మంత్రి శంకరనారాయణ - దెబ్బతిన్న పంటల పరిశీలన

కదిరి , నవంబరు 25 : నియోజకవర్గంలో నాలుగు హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. 7.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. గురువారం హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్‌, ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డితో కలిసి పట్టణంలోని నానాదర్గా వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు పంటల పరిశీలన కోసం, అదేవిధంగా తుఫాన్‌ బాధితులు అందరికీ రేషన్‌ పంపిణీ, రిలీఫ్‌ కేంద్రాలు ఏర్పాటు, తదితర అంశాలపై మంత్రి సమీక్షిం చారు.  అంతకు ముందు సైదాపురం ఆంజనేయస్వామి ఆలయం, అజంతా టా కీస్‌, నానాదర్గా ప్రాంతాల్లో బ్రిడ్జి నిర్మాణాలకు అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో దాదాపు 8300 ఎకరాల్లో వరి, 180 ఎకరాల్లో కంది, వేరుశనగ దెబ్బతిన్నట్లు మంత్రి తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆర్‌ అండ్‌బీ డీఈ రాజగోపాల్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ నజీమున్నీసా, వైస్‌ ఛైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి, గంగా దేవీ, జడ్పీటీసీ అనితాబాయి, ఎంపీపీలు, కౌన్సిలర్‌లు తదితరులు పాల్గొన్నారు. 

గాండ్లపెంట: మండలంలోని రెక్కమాను గ్రామంలోని వెలిచెలమల రహదారిలో దెబ్బతిన్న కల్వర్టులను రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పరిశీలించారు. అదే విధంగా మండలంలోని పలు చోట్లు కల్వర్టులు దెబ్బతిని రాకపోకలు స్తంభించారు. దీంతో ఆ గ్రామాలకు కనీస నిత్యావసర సరుకులు, వైద్యం కోసం ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లు నిర్మాణాల పనులు త్వరితగతిన చేపడతామన్నారు.  కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు ఉన్నారు. 

Updated Date - 2021-11-26T06:14:34+05:30 IST