జేడీఎస్‌ హయాంలోనే మహిళలకు ప్రాధాన్యత : దేవేగౌడ

ABN , First Publish Date - 2021-12-08T05:21:45+05:30 IST

తాను ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా 33 శాతం మహిళలకు రిజర్వేషన కల్పించింది తన హయాంలోనేనని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మాజీ ప్రధాని హెచ.డి.దేవేగౌడ తెలియజేశారు.

జేడీఎస్‌ హయాంలోనే మహిళలకు ప్రాధాన్యత : దేవేగౌడ

పావగడ, డిసెంబరు 7: తాను ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా 33 శాతం మహిళలకు రిజర్వేషన కల్పించింది తన హయాంలోనేనని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మాజీ ప్రధాని హెచ.డి.దేవేగౌడ తెలియజేశారు. మంగళవారం ఎస్‌ఎ్‌సకే రంగమందిరంలో నిర్వహించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక రైతు కుటుంబంలో పుట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామి రూ. 25 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసి రైతు రుణం తీర్చుకొన్నారని అభిప్రాయపడ్డారు. ప్రాంతాభివృద్ధి చెందాలంటే ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టాలని, డిసెంబరు 10న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనీల్‌కుమార్‌ను గెలిపించడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పునాది అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వేదికపైన మహిళలకు చోటు కల్పించకపోవడంతో స్థానిక నాయకులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, జిల్లా అధ్యక్షుడు ఆర్‌.సి.అంజినప్ప, తిమ్మారెడ్డి, ఎస్‌.కె.రెడ్డి, బలరామరెడ్డి, అనేక మంది జేడీఎస్‌ నాయకులు పాల్గొన్నారు. Updated Date - 2021-12-08T05:21:45+05:30 IST