అధికారం.. సగం.. సగం..!

ABN , First Publish Date - 2021-02-06T07:14:11+05:30 IST

ఎన్నికలు వద్దు.. ఏకగ్రీవమే ముద్దు.. అని మండలంలోని కట్టకిందపల్లి గ్రామ ప్రజలు మరోసారి తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

అధికారం.. సగం.. సగం..!

 కట్టకిందపల్లిలోనూ ఏకగ్రీవం

సర్పంచ్‌ పదవిని పంచుకున్న వైసీపీ, టీడీపీ సానుభూతిపరులు 

పామిడి, ఫిబ్రవరి 5 : ఎన్నికలు వద్దు.. ఏకగ్రీవమే ముద్దు.. అని మండలంలోని కట్టకిందపల్లి గ్రామ ప్రజలు మరోసారి తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఈసారి కూడా ఏకగ్రీవంగానే సర్పంచును ఎన్నుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు... వైసీపీ మద్దతు ఉన్న సల్లా కదిరమ్మ, టీడీపీ మద్దతు ఉ న్న వరలక్ష్మి ఇద్దరూ రెండున్నర సంవత్సరాల పాటు సర్పంచులుగా కొనసాగేలా గ్రామ పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. వైసీపీ అధికారంలో ఉండడంతో  ముందుగా వైసీపీ మద్దతు అభ్యర్థి సర్పంచుగా పదవిని చేపట్టేలా నిశ్చయించుకున్నట్టు సమాచారం. 


Updated Date - 2021-02-06T07:14:11+05:30 IST