కుండపోత

ABN , First Publish Date - 2021-10-25T06:15:29+05:30 IST

జిల్లావ్యాప్తంగా పలుచోట్ల శని వారం రాత్రి నుంచి ఆదివారం వరకు భారీ వర్షం కురిసిం ది. ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.

కుండపోత
రాయదుర్గంలో జలమయమైన కొలిమి వీధి

భారీ వర్షంతో నట్టేట మునిగిన పంటలు

పప్పుశనగ, వేరుశనగ రైతు విలవిల - రూ.కోట్లల్లో నష్టం

పొంగిపొర్లిన వాగులు, వంకలు - రాకపోకలకు అంతరాయం

జలమయమైన లోతట్టు కాలనీలు - ఇళ్లల్లోకి చేరిన నీరు


యాడికి, అక్టోబరు 24: జిల్లావ్యాప్తంగా పలుచోట్ల శని వారం రాత్రి నుంచి ఆదివారం వరకు భారీ వర్షం కురిసిం ది. ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంటపొలాలు చెరువులను తలపించాయి. యాడికి మండలంలో శనివారం రాత్రి 65.4 మి.మీ. వర్షపాతం నమోదైం ది. భోగాలకట్ట గ్రామంలో సుమారు 200 ఎకరాల్లో సాగుచేసిన పప్పుశనగ పంట నీటమునిగింది. మరో 500 ఎకరా ల్లో మొలక దశలో ఉన్న పంట మొత్తం వర్షపునీటి ధాటికి  పనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టులో ఉన్న పంట పొలాలన్ని నీటమునిగా యి. 15 రోజుల క్రితమే పప్పుశనగ విత్తు వేశామని, విత్త నం ఎరువుల కోసం ఎకరాకు రూ.20 వేల వరకు ఖర్చుచేశామని, ఇలా గ్రామంలో నష్టపోయిన పప్పుశనగ పంటన ష్టం కోటిన్నర రూపాయల మేర ఉంటుందని రైతులు తెలిపారు. అధికారులు పప్పుశనగ పంట పొలాలను పరిశీలిం చి నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు. 


పంట అంతా నీటి పాలు

లక్ష్మిరెడ్డి, పప్పుశనగ రైతు, భోగాలకట్ట

ఐదు ఎకరాల్లో రూ.లక్ష వరకు ఖర్చుపెట్టి పప్పుశనగ సా గుచేశా. మొలకలు కూడా వచ్చాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి పంట అంతా నీటిలో మునిగింది. గ్రామమం తా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. పప్పుశనగ నష్టపోయిన రై తులను ప్రభుత్వమే ఆదుకోవాలి.


గుంతకల్లు/గుంతకల్లు టౌన: పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంట ల నుంచి ఒ్టఇ గంట వరకు తెరిపి లేకుండా వర్షం పడింది. కుండపోతగా వర్షం కురవడంతో డీఎస్పీ ఆఫీసు సర్కిల్‌, పాత బస్టాండు, సత్యనారాయణ పేట వంతెన వద్ద వర్ష పునీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో జనం రాకపోక లకు ఇబ్బంది ఏర్పడింది. సాయంత్రం చిన్నపాటి వర్షం కురిసింది. పాదాచారులు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు.


రాయదుర్గం టౌన: పట్టణంలో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన వర్షం దాదాపు మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిం ది. దీంతో కొండ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటితో పాటు వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సిద్దేశ్వర కాలనీ, పార్వతి నగర్‌, కేబీ ప్యాలెస్‌ రోడ్డు, కొలిమి వీధి, రామస్వామి వీధి, మధు టాకీస్‌ ప్రాంతాలు జనసం ద్రమయ్యాయి. రహదారులన్నీ వరదనీటితో నిండిపోయా యి. కాలువలు నిండి నీరంతా రహదారుల్లో వచ్చి చేరడం తో పాదాచారులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోయింది. పలు గృహాల్లోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


బెళుగుప్ప: మండలంలో ఆదివారం భారీవర్షం కురిసిం ది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు పప్పుశనగరైతు లను ఆందోళన కల్గిస్తున్నాయి. తేమశాతం అధికమై పైరు పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వాపోతున్నారు. మరోవైపు వర్షాలతో మండలంలోని వంకలు, వాగులు, కుంటలు పొంగిపొర్లాయి.


కంబదూరు: మండలంలో రెండు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. శని,ఆదివారాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కదిరిదేవరపల్లిలో బొప్పాయి చెట్లు నేలమట్టం కావడంతో రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. వేరుశనగ పంటంతా తడిసిపోయింది. పలు రహదారులు కోతకుగురయ్యాయి. చెన్నంపల్లి, జెల్లిపల్లి ప్రాంతాల్లో వర్షంధాటికి రోడ్లన్ని దెబ్బతిన్నాయి. జెల్లిపల్లి వ ద్ద పొలాలకు వెళ్లే రహదారి కల్వర్టు ధ్వంసమైంది. చేతికొచ్చిన టమోటా పంట దెబ్బతినడంతో ప్రభుత్వం ఆదుకోవలని బాధిత రైతులు కోరుతున్నారు.  


ఉరవకొండ: నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతిని కుళ్లిపోవడంతో రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రేణుమాకులపల్లి, బూదగవి, ఉరవకొండ గ్రామాలలో తొలగించి పొలంలోనే కుప్పపోసిన పంటంతా నీటిపాలైంది. చెట్టుకు న్న రెండు, మూడు కాయలు కూడా నల్లగా మారాయి. వే రుశనగ కట్టి వానకు నానడంతో బూజుపట్టి కనీసం పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సుమారుగా రూ.40 వే లు దాకా నష్టపోయామని వాపోతున్నారు. బూదగవి చెరు వు జలకళను సంతరించుకుంది. చెరువు నిండి మరువ పా రుతోంది. శనివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకూ ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. 31.6 మి.మీ. వర్షపాతం న మోదైంది. భారీ వర్షానికి పట్టణంలోని టవర్‌క్లాక్‌ కూడలి మడుగులా తయారైంది. దీంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


విడపనకల్లు: మండలంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. విడపనకల్లు -ఆర్‌ కొట్టాల రోడ్డుపై పెద్ద వంక ఉధృతంగా ప్రవహించిం ది. రాత్రి సమయం కావటంతో రాక పోకలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. గడేకల్లు, అర్‌ కొట్టాల, విడపనకల్లు, పాల్తూరు, చీకలగురికి, ఉండబండ గ్రామాల్లోని వంకలు భారీగా పొంగిపొర్లాయి. బళ్లారి-గుంతకల్లు జాతీయ రహదారిపై డొనేకల్లు వద్ద పెద్ద వంక ఉధృతంగా ప్రవహించిం ది. వాహనాలు రాత్రి సమయంలో దాదాపుగా కిలోమీటరు మేర నిలిచి పోయాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి రాక పోకలు ప్రారంభమయ్యాయి. మండలంలో 27.6 మి. మీ. వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. 


గుమ్మఘట్ట: మండలంలో ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత మెయినలైన తీగలు తెగిపడ్డాయి. దీంతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు విద్యుత సరఫ రా నిలిచిపోయింది. దీంతో గ్రామాలన్నీ అంధకారంలో వు న్నాయి. రాయదుర్గం పట్టణం నుంచి గుమ్మఘట్ట మండలానికి వచ్చే విద్యుత మెయినలైన తీగలు 75 వీరాపురం వద్ద తెగిపోయాయి. వాటిని గుర్తించేందుకు శనివారం మ ధ్యాహ్నం నుంచి విద్యుత శాఖ అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. చివరకు ఆదివారం రాత్రి మెయిన లైన కండెక్షనలు పాడైనట్లు గుర్తించారు. మరమ్మతులు చేపట్టి విద్యుత సరఫరా అందిస్తామని తెలిపారు. రాత్రి 9 గంటల దాకా విద్యుత సరఫరా లేకపోవడంతో గ్రామాలన్నీ చీకట్లో వు న్నాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


యల్లనూరు: మండలంలో ప్రవహిస్తున్న చిత్రావతినది లో ఆదివారం నీటి ఉధృతి అధికమైంది. పార్నపల్లి డ్యాం రెండు గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం ఉధృతమైంది. దీం తోపాటు చిత్రావతి నది పరివాహక ప్రాంతాల్లో కూడా వ ర్షం కురవడంతో నదిలోకి నీరు వచ్చి చేరింది. నీటి ప్రవా హం పెరగడంతో పిల్లలను నది వద్దకు తీసుకువెళ్లరాదని ఎస్‌ఐ జగదీష్‌ సూచించారు.


Updated Date - 2021-10-25T06:15:29+05:30 IST