పూలకుంటలో పారిశుధ్యం అధ్వానం

ABN , First Publish Date - 2021-08-21T06:01:55+05:30 IST

- గ్రామ సచివాలయం ఎదుటే అపరిశుభ్రత

పూలకుంటలో పారిశుధ్యం అధ్వానం
కాలువ సరిగా లేకపోవడంతో పెరిగిన పిచ్చిమొక్కలు


అనంతపురంరూరల్‌,ఆగస్టు20: మండలంలోని పూలకుంట గ్రామంలో పారిశుద్యం అధ్వానంగా మారింది. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు ముందు కు సాగడంలేదు. దీనికితోడు రోడ్లపైనే నీరు రోజుల తరబడి నీరు నిల్వ ఉం టోంది. గ్రామ సచివాలయం వద్ద పరిస్థితి మరి అధ్వానంగా తయారైంది. కా లువలు దెబ్బతినడంతో పిచ్చిమొక్కలు పెరిగి, మురుగు నీరు సక్రమంగా వెల్లడటం లేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. నిత్యం సచివాలయానికి అధికారులు, ఉద్యోగులు వెళ్లివస్తున్నారు.. అయినా అక్కడి పరిస్థితులను పట్టించుకోకపోవడం ప్రజల పాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పం దించి, కాలువల్లో పేరుకుపోయిన అపరిశుభ్రతను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Updated Date - 2021-08-21T06:01:55+05:30 IST