పేదల గూడు.. నత్తనడక పనులు చూడు!

ABN , First Publish Date - 2021-08-27T06:52:36+05:30 IST

ప్రభుత్వం పతిష్టాత్మకంగా చేపట్టిన జగన న్న కాలనీల నిర్మాణాలు బాలారిష్టాల నుంచి గట్టెక్కని పరిస్థితులు నెలకొన్నాయి.

పేదల గూడు.. నత్తనడక పనులు చూడు!
రాయంపల్లి రోడ్డులో పునాదుల నిర్మాణానికి డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసుకున్న దృశ్యం

జగనన్న కాలనీల్లో కనీస సదుపాయాలు కరువు

పునాదుల దశ దాటని ఇళ్ల నిర్మాణాలు


ఉరవకొండ, ఆగస్టు 26: ప్రభుత్వం పతిష్టాత్మకంగా చేపట్టిన జగన న్న కాలనీల నిర్మాణాలు బాలారిష్టాల నుంచి గట్టెక్కని పరిస్థితులు నెలకొన్నాయి. ‘నవరత్నాలు- పేదలందరికి ఇళు’ పథకంలో భాగంగా అర్హులకు ఇ ళ్ల స్థలాలు పంపిణీ చేసి వాటిని నిర్మాణాలు చేపట్టాలన్న సంకల్పంతో మె గా గ్రౌండింగ్‌ మేళా పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లే అవుట్‌లలో కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి వసతి, ఇసుక సరఫరా కాక నిర్మాణ పనులు ముందు కు సాగడం లేదు. నియోజకవర్గంలో 26,173 ఇళ్లు మంజూరయ్యాయి. మె గా గ్రౌండింగ్‌ మేళాలో భాగంగా 12 వేల నిర్మాణాలు గ్రౌండింగ్‌ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఉరవకొండలో 3,300, వజ్రకరూరులో 2,670, విడపనకల్లులో 2,610, బెళుగుప్పలో 2,130, కూడేరులో 1290 ఇళ్ల నిర్మాణా లు ప్రారంభమయ్యాయి. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లేఅవుట్‌లో విద్యుత, నీ టివసతి, రహదారులు తదితర మౌళిక సదుపాయాలు అంతంతమాత్రంగానే కల్పించారు. దీంతో ఇంటి నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు అదనపుభారం పడుతోంది.


నియోజకవర్గ కేంద్రమైన ఉరవకొండలో 2,900 మంది దాకా లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారు. కొలిమి లేఅవుట్‌ స మీపంలో 1500 మందికి పట్టాలు మంజూరు చేశారు. ఇక్కడ బోరు వే సినా, విద్యుత సదుపాయాన్ని కల్పించలేదు. నిర్మాణ నీటి కోసం లబ్ధిదారు లు ఒక్కొక్క ట్యాంకర్‌కు రూ.600 చెల్లించి కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకుంటున్నారు. పునాదులకే నీటి కోసం రూ.2 వేల దాకా ఖర్చైందని లబ్ధిదారులు వాపోతున్నారు. రాయంపల్లి రోడ్డులోని లేఅవుట్‌లు, నీటి వసతి లేక సమీపంలోని వంకల నుంచి నీటిని తెచ్చుకుని నిర్మాణానికి వినియోగిస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.


ఒక్కొక్క లబ్ధిదారునికి ఇంటి నిర్మాణాల కోసం ప్ర భుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం పునాది నిర్మాణానికే రూ.లక్ష దాటే పరిస్థితులున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. మరికొన్ని గ్రామాల్లో లేఅవుట్‌లకు వెళ్లే మార్గాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఈ విషయంపై హౌసింగ్‌ డీఈ ఖాదర్‌బాషను వివరణ కోరగా నీటి సదుపాయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఉరవకొండలోని 5 లేఅవుట్‌లు కొత్తవి కావడం వల్ల బోరు మంజూరులో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఇసుక కొరత కూడా లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. 

Updated Date - 2021-08-27T06:52:36+05:30 IST