అంగన్వాడీ కేంద్రం ఎదుట మడుగు
ABN , First Publish Date - 2021-10-25T06:13:03+05:30 IST
మండల పరిధిలోని చీకటిమానిపల్లి గ్రామంలో అం గన్వాడీ కేంద్రానికి వెళ్ళాలంటే చిన్నారులకు పడవ ప్రయాణం తప్పదని గ్రామస్థులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

తనకల్లు, అక్టోబరు 24: మండల పరిధిలోని చీకటిమానిపల్లి గ్రామంలో అం గన్వాడీ కేంద్రానికి వెళ్ళాలంటే చిన్నారులకు పడవ ప్రయాణం తప్పదని గ్రామస్థులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అంగన్వాడీ కేంద్రం వద్ద చెరువును తలపించేలా నీరు నిలిచింది. ఈ కారణంగా చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళాలంటే నీటిలో దిగి వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది. గ్రామం మధ్య లో చెరువును తలపించేలా నీళ్ళు నిల్వ ఉన్నా అధికార గణం పట్టించుకున్న పాపాన పోలేదని గ్రా మస్థులు ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ తోపుపా రేసు తెలిపారు. నీళ్ళు నిల్వ ఉండటం వల్ల చుట్టుపక్కల కాపురాలు ఉన్న ఇళ్ళలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే చిన్న పిల్లలు కూడా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. గ్రామంలోని సచివాలయ అధికారు లకు తెలిపినా స్పందించక పోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు.