పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-29T06:03:46+05:30 IST
పట్టణంలోని విజయ నగర్ కాలనీకి చెందిన నాగయ్య, సుబ్బలక్ష్మి కుమారు డు నవీనకుమార్ (18) గురువారం ఉదయం రైలు కిం ద పడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు వరప్రసాద్, ప్రసాద్‌లు తెలిపారు.
తాడిపత్రిటౌన, అక్టోబరు 28: పట్టణంలోని విజయ నగర్ కాలనీకి చెందిన నాగయ్య, సుబ్బలక్ష్మి కుమారు డు నవీనకుమార్ (18) గురువారం ఉదయం రైలు కిం ద పడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు వరప్రసాద్, ప్రసాద్‌లు తెలిపారు. వారు తెలిపిన మేర కు నవీనకుమార్ స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశా లలో సెకెండియర్ చదువుతున్నాడు. ఇంటికి సరైన స మయానికి రాకపోవడంతో బుధవారం తండ్రి నాగయ్య మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన నవీనకుమార్ పాత బా య్స్ హైస్కూల్ సమీపంలోని రైల్వేట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. నాగ య్య హమాలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా నవీనకుమార్ మొదటి కుమారుడు. రెండో కుమారుడు పదో తరగతి చ దువు తున్నాడు. తండ్రి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆ స్పత్రికి తరలించారు.