చిన్నప్పుడు పోలియో... గుండెకు రంధ్రం..!
ABN , First Publish Date - 2021-05-05T06:02:36+05:30 IST
అతడి వయస్సు పాతికేళ్లు..చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఫలితంగా ఒక కాలు, చేయి సరిగా పనిచేయవు. ఇది చాలదన్నట్టు..ఇప్పుడెమో గుండెకు రంధ్రం ఏ ర్పడింది.

పాతికేళ్ల వయసులో అచేతనంగా ఓ యువకుడు
కొడుకు స్థితిని చూసి తల్లడిల్లుతున్న తల్లింద్రడులు
గుండె ఆపరేషనకు రూ.6లక్షలన్న వైద్యులు
ఆపన్నహస్తం కోసం పేదకుటుంబం ఎదురుచూపు
అనంతపురంరూరల్, మే4: అతడి వయస్సు పాతికేళ్లు..చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఫలితంగా ఒక కాలు, చేయి సరిగా పనిచేయవు. ఇది చాలదన్నట్టు..ఇప్పుడెమో గుండెకు రంధ్రం ఏ ర్పడింది. దీంతో బతికి ఉండాగానే నరకం చూస్తున్నాడు. పోలియో కారణంగా ఎక్కువ దూరం నడవలేని స్థితి. నడిచినా గుండెకు ఏర్పడ్డ రంధ్రం కారణంగా ఆయసంతో కిందికి పడిపోతాడు. దీంతో అతడు మంచానికే పరిమితమయ్యాడు. కొడుకు పరిస్థితిని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కొడుకు గుండె ఆపరేషనకు అయ్యే సొమ్ములేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
వివరాల్లోకి వెళ్లితే..
అనంతపురం రూరల్ మండలం ఆలమూరు పంచాయితీ ఎంబీ పల్లి గ్రామ సమీపంలో ఉన్న ఓ రైతు పొలంలో ఎస్ ఇమామ్‌సాబ్ నెల జీతగాడిగా పనిచేస్తున్నాడు. ఆయనది గార్లదిన్నె మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ. పదేళ్ల కిందట తన భార్య హసీనా, ఇద్దరు కొడుకులు మహబూబ్‌భాషా, ఖాసీంపీరాతో కలిసి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చాడు. కుటుంబసభ్యులంతా కలసి పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అతడి పెద్ద కుమారుడు మహబూబ్ భాషాకు చిన్నప్పుడే పోలియో కారణంగా కాలు, చేయి పడిపోయాయి. దీనికితోడు ఆయసంతో ఇబ్బంది పడు తూ వస్తూన్నాడు. పలు ఆస్పత్రులకు తిరిగారు. ప్రయోజనం లేకుండా పోయింది. పదేళ్ల కిందట పరిస్థితి మరింత అధ్వానంగా మారడంతో పుట్టపర్తి ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి గుండెకు రంధ్రం ఏర్పండిందని తెలిపారు. ఆపరేషన తమకు సాధ్యం కాదన్నారు. దీంతో తిరుపతిలోని సిమ్స్‌కు కొన్ని నెలలు తిరిగారు. అక్కడి నుంచి హైదరబాదులోని కిమ్స్, సనషైన ఆస్పత్రులలోను, విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలోను చూపించారు. ఈ క్రమంలోనే రూ.2లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు అప్పులు చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఏడాది మొదట్లో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మహబూబ్‌బాషా విషయాన్ని తెలుసుకుని ఆపరేషనకు రూ.6లక్షలు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులకు సూచించా రు. పొలంలో జీతగాడిగా పనిచేసే తాను అంత సొమ్ము పెట్టుకోలేమని దంపతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఇప్పటికే అయిన అప్పులతో సతమవతున్న తమకు అంత సొమ్మును తీసుకొచ్చే పరిస్థితి లేదని..మంచాన పడిన కొడుకును చూస్తూ రోదిస్తున్నారు. దాతలు దయతలచి తమ కుమారుడికి ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకొంటున్నారు. సాయం చేయదలచిన వారు బ్యాంకు అకౌంట్ నెంబరు:0979101033133(ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఇూఖఆ0000979) కు అందించాలని, కావలిస్తే ఫోన నెంబర్:7569010950 ద్వారా వివరాలు తెలుసుకోవచ్చిని వాడు వేడుకుంటున్నారు.