పోలీసులు ప్రజా సేవలో ముందుండాలి : జీఆర్పీ ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-29T05:55:48+05:30 IST

పోలీసులు విధి నిర్వహణలోనే కాదు.. సా మాజిక కార్యక్రమాలలోనూ బాధ్యతగా ముందుండాలని జీఆర్పీ ఎస్పీ అనిల్‌బాబు పేర్కొన్నారు.

పోలీసులు ప్రజా సేవలో ముందుండాలి : జీఆర్పీ ఎస్పీ
జీఆర్పీ ఎస్పీ అనిల్‌బాబు పర్యవేక్షణలో రక్తదానం చేస్తున్న పోలీసులు

గుంతకల్లు, అక్టోబరు 28: పోలీసులు విధి నిర్వహణలోనే కాదు.. సా మాజిక కార్యక్రమాలలోనూ బాధ్యతగా ముందుండాలని జీఆర్పీ ఎస్పీ అనిల్‌బాబు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భా గంగా గురువారం స్థానిక రైల్వే పోలీసు పరేడ్‌ గ్రౌండులో రక్తదాన శిబిరా న్ని నిర్వహించారు. శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించగా, జీఆర్పీ సీఐ బీవీ నగేశబాబు, ఆర్‌ఐ రామానుజులు, ఎస్‌ఐ సురేశ, సిబ్బంది, ఆటో డ్రైవర్లు, రైల్వే లగేజి పోర్టర్లు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జీఆర్పీ ఏఆర్‌ ఎస్‌ఐ బీ వెంకట రమణ, ఏఎ్‌సఐ గోపి పాల్గొన్నారు.


రాయదుర్గం టౌన:  పట్టణంలోని అర్బన పోలీస్‌ స్టేషనలో గురువారం ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల సహకారం తో అర్బన సీఐ సురే్‌షబాబు ఆధ్వర్యంలో బీపీ, షుగర్‌, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ బాలరాజు, వైద్యఆరోగ్య, పోలీసు సిబ్బంది, ఆటో కార్మికులు పాల్గొన్నారు. 


ఉరవకొండ: మండలంలోని నింబగల్లు గ్రామంలో సవీర ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వై ద్యులు రఘునాథ్‌, సురేష్‌, నరేంద్ర ఆధ్వర్యంలో  వైద్య పరీక్షలు చేపట్టారు. 200 మందికి 2డీ, ఎకో, ఈసీజీ పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రమే్‌షరెడ్డి, సిబ్బంది రామాంజినేయులు, అంజి, ఈశ్వర్‌ నాయక్‌, రజనీ పాల్గొన్నారు.


గుంతకల్లుటౌన: పట్టణంలోని ఎస్‌ఎల్వీ టాకీ్‌సలో గురువారం ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డీఎస్పీ నరసింగప్ప పర్యవేక్షణలో క్రాక్‌ చి త్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రంలో రవితేజ పోలీసు అధికారిగా నటించిన పరాక్రమ విధులను ప్రదర్శించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వనటౌన, టూటౌన సీఐలు నాగశేఖర్‌, చిన్న గోవిందు పాల్గొన్నారు. 


గుత్తి: పట్టణంలోని పోలీసు స్టేషనలో గురువారం ఉచిత వైద్య శిబిరా న్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైద్యుడు ప్రశాంతవర్ధన పోలీసులు, ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు. పోలీసులు ప్రజా సేవలోనూ ముందుండాలని  సీఐ శ్యామరావు, ఎస్‌ఐ మురారిబాబు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T05:55:48+05:30 IST