టీడీపీ కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు
ABN , First Publish Date - 2021-10-20T06:10:11+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా తెలు గుదేశం పార్టీ కార్యాల యాలపై వైసీపీ శ్రే ణులు దాడులకు పా ల్పడటంతో ఆ పార్టీ కనగానపల్లి నాయకు లు అప్రమత్తమయ్యారు.

కనగానపల్లి, అక్టోబరు19: రాష్ట్ర వ్యాప్తంగా తెలు గుదేశం పార్టీ కార్యాల యాలపై వైసీపీ శ్రే ణులు దాడులకు పా ల్పడటంతో ఆ పార్టీ కనగానపల్లి నాయకు లు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి పార్టీ అధ్యక్షుడు కసుమూర్తి వెంకటేష్, ఎంపీటీసీ బిల్లేభాస్కర్ మాజీ సర్పంచ టీసీ సుబ్రహ్మణ్యం, బట్టా సురేష్‌చౌదరి పార్టీ కార్యాలయం వద్దకు చేరుకు న్నారు. ఈ క్రమంలో ఎస్‌ఐ ఆంజనేయులు అక్కడికి చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడారు. పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని ఎవ్వరూ ఆందోళనకు పాల్పడవద్దని సూచించారు.