మెడికల్‌ షాపులపై పోలీసులు దాడులు

ABN , First Publish Date - 2021-05-03T05:10:18+05:30 IST

పట్టణంలోని ప్రధాన మెడికల్‌ షాపులపై వనటౌన సీఐ బాలమద్దిలేటి ఆధ్వర్యంలో మెరుపుదాడులు నిర్వహించారు.

మెడికల్‌ షాపులపై పోలీసులు దాడులు
మెడికల్‌ షాపులో ఔషధాలను తనిఖీ చేస్తున్న సీఐ

హిందూపురం టౌన, మే 2: పట్టణంలోని ప్రధాన మెడికల్‌ షాపులపై వనటౌన సీఐ బాలమద్దిలేటి ఆధ్వర్యంలో మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్‌షాపుల్లో తనిఖీ నిర్వహించారు. కొవిడ్‌ బాదితులకు ఇచ్చే ఇంజెక్షన రెమెడీ్‌సపియర్‌ అక్రమంగా నిలువ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తే మెడికల్‌ షాపులు సీజ్‌ చేయడంతోపాటు యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెమిడి్‌సపియర్‌ బ్లాక్‌లో విక్రయించడానికి ఆస్కారం లేదన్నారు. అలా అక్రమంగా నిలువ ఉంచుకుంటే కొవిడ్‌ నిబంధనల ప్రకారం జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించాలని అవసరమైన మందులను బ్లాక్‌లో అమ్మరాదన్నారు. ఇవేకాక ఇతర ఔషదాలు కూడా కృత్రిమంగా కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. Updated Date - 2021-05-03T05:10:18+05:30 IST