పోలీసు అమరవీరుల సంస్మరణ దినానికి సిద్ధం
ABN , First Publish Date - 2021-10-21T06:25:38+05:30 IST
: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినానికి పోలీసు యంత్రాంగం ఏ ర్పాట్లను సిద్ధం చేసింది.

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ ఫక్కీరప్ప
అనంతపురం క్రైం, అక్టోబరు 20: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినానికి పోలీసు యంత్రాంగం ఏ ర్పాట్లను సిద్ధం చేసింది. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప బుధవారం సా యంత్రం ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బంది రిహార్సల్స్ తిలకించారు. పకడ్బందీ చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశా రు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేంద్రుడు, ఏఆర్ ఏఎస్పీ హనుమంతు, పలువురు ఆర్ఐలు పాల్గొన్నారు.
