పోలీసుశాఖలో కరోనా కలవరం..!

ABN , First Publish Date - 2021-05-02T06:04:55+05:30 IST

జిల్లా పోలీసుశాఖలో కరోనా కలవరం రేపుతోంది. జిల్లాలో కరోనా వ్యాప్తి చెంద కుండా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సా రించింది. ఎక్కడిక్కడ ఆయా ప్రాం తాల పోలీసులు బృందా లుగా ఏ ర్పడి ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్‌, మాస్క్‌లు ధరించకుండా తిరిగే వారిపై జరి మానాలు విధిస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు.

పోలీసుశాఖలో కరోనా కలవరం..!

200 మందికి పాజిటివ్‌ 

 ఇద్దరు మృతి.. 

10 మందికి ఆక్సిజనపై వైద్యచికిత్స 

 ఆందోళనలో పోలీసు కుటుంబాలు

అనంతపురం క్రైం, మే1 : జిల్లా పోలీసుశాఖలో కరోనా కలవరం రేపుతోంది. జిల్లాలో కరోనా వ్యాప్తి చెంద కుండా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సా రించింది. ఎక్కడిక్కడ ఆయా ప్రాం తాల పోలీసులు బృందా లుగా ఏ ర్పడి ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్‌, మాస్క్‌లు ధరించకుండా తిరిగే వారిపై జరి మానాలు విధిస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. ఆయితే ఇదే క్రమంలో కొందరు పోలీసులు కరోనా బారిన పడటంతో ఆశాఖలో భయాందోళన నెలకొంది.  ఇప్పటికే 200మంది పోలీసు ఉద్యోగులకు కరో నా నిర్ధారణ కావ డంతో పాటు ఒక హోంగార్డు, ఒక హెడ్‌కానిస్టేబుల్‌ మృతి చెందడం మరింత కలవరం రేపుతోంది. 10మంది ఉద్యో గులు ఆ క్సిజనపై వైద్యచికిత్సల పొందుతుండటం బాధిత కుటుంబాల్లో ఆందోళన కలిగి స్తోంది. 


గత ఏడాది 900 మందికి...

గత ఏడాది జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న 900మంది పోలీసు ఉద్యోగులకు కరోనా సోకింది. ఐదు గురు మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ప్రారం భమైన కరోనా సెకెండ్‌ వేవ్‌ నేపథ్యంలో కూడా జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న 150మంది పోలీసు ఉద్యోగు లకు కరోనా ని ర్ధారణ కావడంతో పాటు ఒక హోంగార్డు, ఒక హెడ్‌ కాని స్టేబుల్‌ మృతి చెందడం ఆశాఖ ఉద్యోగు లను ఉక్కిరి బిక్కి రి చేస్తోంది. ఏసీబీ, విజిలెన్స, ట్రాన్సకో, ఇంటెలిజెన్స తదితర విభాగాలలో పనిచేస్తున్న 50 మంది పోలీసు ఉద్యోగులకు కరోనా సోకింది. మొత్తంగా 200 మందికి ఇ ప్పటికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆశాఖ ఉద్యోగులతో పాటు బా ధిత కుటుంబాలలో ఆందో ళన నెలకొంది. కరోనా సోకిన వారిలో  ము గ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు ఉండటంతో వారి వద్ద పనిచేసిన కింది స్థాయి ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. మాస్క్‌లు ధరించడం తో పాటు శానిటైజర్‌ వినియోగం వంటి వి చేస్తున్నప్పటికీ విధుల్లో కొందరు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కొందరు పోలీసులు కరోనా నేప థ్యంలో ఉద్యోగం చేయాలంటే భయపడుతున్నట్టు  ఆశాఖ వర్గాల నుంచి తెలిసింది.  


 నిత్యం ఆరోగ్య సేవలపై ఆరా తీస్తున్నాం   

- సత్యఏసుబాబు, ఎస్పీ 

కరోనా నేపథ్యంలో పోలీసు ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిత్యం ఆరోగ్య సేవలపై ఆరా తీయడంతో పాటు తగిన వైద్యసేవలంచేలా చర్యలు తీసు కున్నాం. కరోనా సోకిన పోలీసు ఉద్యోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నాం. పోలీసు ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఆదిశగా ఆరోగ్య పరీక్ష లు, తదితర చర్యలు తీసుకున్నాం. కరోనాతో జిల్లాలో ఇద్ద రు మృతి  చెందడం బాధాకరం. విధులతో పాటు ఆరో గ్యంపై కూడా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూ చించాం. 


Updated Date - 2021-05-02T06:04:55+05:30 IST