మొక్కలు నాటడాన్ని యజ్ఞంలా చేపట్టాలి : జేసీ సిరి

ABN , First Publish Date - 2021-08-20T06:26:59+05:30 IST

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కా ర్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి పేర్కొ న్నారు.

మొక్కలు నాటడాన్ని యజ్ఞంలా చేపట్టాలి : జేసీ సిరి
మొక్క నాటుతున్న జేసీ సిరి


శింగనమల, ఆగస్టు19 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కా ర్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి పేర్కొ న్నారు. మండల పరిధిలోని చక్రాయపేట పంచాయతీలోని పోతురాజుకాలువ గ్రామంలో గురువారం జగనన్న పచ్చతోరణం వనమ హోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి జేసీ సిరి హాజరై మొక్కలు నాటారు.  కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ పీఆర్‌ శశి ధర్‌ రెడ్డి, పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, అడిషనల్‌ పీడీ విజయ్‌కుమార్‌, ఏపీడీ అయూష, ఎంపీడీఓ నిర్మలకుమారి, ఏపీఓ ఎర్రమ్మ, సర్పంచ సరోజమ్మ  పాల్గొన్నారు.

పాల పంపిణీలో అలసత్వం చేస్తే చర్యలు 

అంగనవాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పాలు పంపిణీ చే యడంలో అలస త్వం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, ఐసీడీఎస్‌ పీడీ సుజనా పేర్కొన్నారు. శింగనమల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని శివపురంలో ఉన్న పాల గోడౌనను వారు గురువారం అకస్మిక తనిఖీ చేశారు. గోడౌనలో నిల్వ ఉన్న పాల ప్యాకెట్లను పరిశీలించారు. అంగనవాడీ కేంద్రంలోని పాల పాకెట్లలో అ క్కడక్కడ పాలు గడ్డలు కట్టడం, పాలల్లో పురుగు లు కనిపి స్తున్నాయన్నారు. కావున అంగనవాడీ కార్యకర్తలు పాల ప్యాకెట్లు తీసుకునేటప్పుడు తప్పక పరిశీలించాలన్నారు. ఇప్పటి నుంచి పాలు లబ్ధిదారుల వేలిముద్రలు తీ సుకున్న తరువాతనే పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం శివపురం అం గనవాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నిర్మలకుమారి, సీడీపీఓ ఉమాశంకరమ్మ, ఏసీడీపీఓ సుజాత, సూపర్‌వైజర్లు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-20T06:26:59+05:30 IST