పెట్రోల్‌, డీజిల్‌ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలి : సీపీఎం

ABN , First Publish Date - 2021-06-21T06:37:55+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని సీపీఎం డివిజన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్‌ చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలి : సీపీఎం
ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

రాయదుర్గంటౌన, జూన 20 : పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని సీపీఎం డివిజన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్‌ చేశారు. పట్టణంలోని శాంతినగర్‌లో వున్న పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆదివారం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకు ల ధరల పెరుగుదలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్‌, డీజి ల్‌ ధరలు అమాంతం పెంచడం దారుణమని మండిపడ్డారు. పెట్రోల్‌ డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే గరిష్ట స్లాబ్‌ 28 శాతం ప్రకారం పన్నువేసినా లీటరు పెట్రోలు ధర రూ.45లకు మించదని తెలిపారు. నిరసనలో నాయకులు నాగరాజు, మధు, అంజి, తిమ్మరాజు, వీరేష్‌, నగేష్‌, ఓబుళేసు, రమేష్‌, రామాంజి, కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T06:37:55+05:30 IST