నేటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి

ABN , First Publish Date - 2021-05-02T06:19:45+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచుకోవాలని టాస్క్‌ఫోర్సు కమిటీ సభ్యులు, ము న్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న, డీఎస్పీ షర్పూద్దీన, తహసీల్దారు రాము పేర్కొన్నారు

నేటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ బండి శేషన్న

గుంతకల్లు టౌన, మే 1: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచుకోవాలని టాస్క్‌ఫోర్సు కమిటీ సభ్యులు, ము న్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న, డీఎస్పీ షర్పూద్దీన, తహసీల్దారు రాము పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో శ నివారం వ్యాపారస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 2 గం టల తరువాత దుకాణాలు తెరచినా, రోడ్లపై ప్రజలు తిరిగినా కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. కరోనా సాకుతో నిత్యావసర సరుకుల ధరలు  పెంచి విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నాలుగు ప్ర దేశాల్లో కూరగాయల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అనంత రం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఫోన ద్వారా తన సందేశాన్ని తెలియజేశా రు. కరోనాను అరికట్టడానికి పట్టణంలోని ప్రజలు, వ్యాపారులు సహకరించాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, మరణాలు కూడా పెరుగుతున్నాయన్నారు. కరోనా రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన కే మైమున, మాజీ మున్సిపల్‌ చైర్మన ఎన రామలింగప్ప, మాజీ వైస్‌ చైర్మన గోపా జగదీష్‌, సీఐలు నాగశేఖర్‌, రియాజ్‌ అహమ్మద్‌, ఎంఈ విశ్వనాథ్‌, టీపీఆర్వో ఓ రా మాంజినేయులు పాల్గొన్నారు. 


యాడికి: మండలకేంద్రంలో ఆదివారం నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలు తెరవకూడదని ఎస్‌ఐ రాంభూపాల్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో అరికట్టే దిశగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.వ్యాపారస్తులంతా స్వచ్ఛందంగా మధ్యాహ్నం 2 గంటలకు దుకాణాలు మూతవేసి వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Updated Date - 2021-05-02T06:19:45+05:30 IST