యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-22T05:23:39+05:30 IST

నిత్య యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పెనుకొండ సబ్‌కలెక్టర్‌ మధుసుధన అన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగా దినోత్సవంలో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌

- సబ్‌ కలెక్టర్‌ మధుసూదన 

లేపాక్షి, జూన 21: నిత్య యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పెనుకొండ సబ్‌కలెక్టర్‌ మధుసుధన అన్నారు. సోమవారం లేపాక్షిలోని ఏకశిలానంది విగ్రహం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్‌ కలెక్టర్‌ మధుసూదన హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా ప్రతిరోజూ చేయడంవల్ల సంపూర్ణ ఆరోగ్యంతోపాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పురావస్తుశాఖ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుశాంతకుమార్‌, జూనియర్‌ కన్సర్వేషన అసిస్టెంట్‌ బాలకృష్ణారెడ్డి, ఎంటీఎస్‌ రాము, తహసీల్దార్‌ బలరాం తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-06-22T05:23:39+05:30 IST