పప్పుశనగ అదనపు కేటాయింపులేవీ..?
ABN , First Publish Date - 2021-12-15T06:06:08+05:30 IST
ప ప్పుశనగ అదనపు కేటాయింపులపై ప్రభుత్వం స్పం దించడం లేదు. రబీ సీజనలో సాగు చేసిన పప్పుశనగ పంటంతా భారీ వర్షాలకు దెబ్బతింది.

స్పందించని ప్రభుత్వం
అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 14: ప ప్పుశనగ అదనపు కేటాయింపులపై ప్రభుత్వం స్పం దించడం లేదు. రబీ సీజనలో సాగు చేసిన పప్పుశనగ పంటంతా భారీ వర్షాలకు దెబ్బతింది. 80 శాతం సబ్సిడీతో తొలుత 16040 క్వింటాళ్ల పప్పుశనగ కేటాయించారు. పంటంతా పోవడంతో అదనంగా 26వేల క్వింటా ళ్ల పప్పుశనగ కేటాయించాలని ఈనెల ఆరంభంలో ప్రతిపాదనలు పంపారు. ఇప్పటిదాకా అదనపు కేటాయింపుపై స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికే పప్పుశనగ సాగు చేసేందుకు అదును సమయం దాటిపోయింది. అయినా కొన్ని ప్రాంతాల్లో పంట సాగు చేసుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని పలు రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటిదాకా 17119 మంది రైతులకు 15575 క్వింటాళ్ల పప్పుశనగ పంపిణీ చేయడంతో సరిపెట్టారు. ప్రత్యామ్నాయ విత్తనాలు సబ్సిడీతో పంపిణీ చేస్తామని ప్రజాప్రతినిధులు, వ్యవసాయ ఉన్నతాధికారులు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. దీంతో బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేసి, విత్తుకోవాల్సిన దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. రైతులకు సకాలంలో పప్పుశనగ, ఇతర విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులు, ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చొరవ చూపకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.