పాహిమాం... పరమేశా..!

ABN , First Publish Date - 2021-11-09T06:51:27+05:30 IST

కార్తీకమాసం తొలి సోమ వారం అనంత ఆధ్యాత్మికశోభతో అలరారింది. శైవక్షేత్రాలన్నీ భక్తుల శి వనామస్మరణతో మార్మోగాయి.

పాహిమాం... పరమేశా..!
ప్రత్యేక అలంకరణలో మొదటి రోడ్డు కాశీవిశ్వేశ్వరస్వామి


- జిల్లావ్యాప్తంగా ఘనంగా కార్తీక దీపోత్సవాలు

అనంతపురం టౌన, నవంబరు 8 :     కార్తీకమాసం తొలి సోమ వారం అనంత ఆధ్యాత్మికశోభతో అలరారింది. శైవక్షేత్రాలన్నీ భక్తుల శి వనామస్మరణతో మార్మోగాయి. సాయంత్రం నుంచి మహిళలు పెద్దఎ త్తున ఆలయాలకు తరలివచ్చి కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  పరమశివుడికి రుద్రా భిషేకాలు, బిళ్వా ర్చనలు, గణపతిహోమాలు చేశారు.  మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం భక్తులతో పోటెత్తింది. వందలాదిమంది మ హిళలు ఆలయ ఆవరణలో కార్తీకదీపాలు వెలిగించారు. హెచ్చెల్సీ కా లనీలోని మంజు నాథస్వామి దేవాలయంలో ప్రధానార్చకుడు మఠం బసవరాజు నేతృత్వంలో బిళ్వార్చనలు, రుద్రాభిషేకాలు చేశారు. అలాగే నగరంలోని మిగిలిన ఆలయాలతోపాటు జిల్లా వ్యాప్తంగా వున్న శివాలయాలన్నీ కార్తీకశోభ సంతరించుకున్నాయి.

శింగనమల : మండలంలోని దేవాలయాల్లో సోమవారం  కార్తీక సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. చిన్నజలాలపురం దోనారామేశ్వర దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు చేశారు. 


Updated Date - 2021-11-09T06:51:27+05:30 IST