ఒకటో వార్డు కౌన్సిలర్‌ ఏకగ్రీవ ఎన్నిక

ABN , First Publish Date - 2021-11-09T06:47:54+05:30 IST

పురపాలక సంఘం పరిధిలోని ఒకటో వార్డు కౌన్సిలర్‌గా వైసీపీ అభ్యర్థి భీమనపల్లి నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా సోమవారం తెలిపారు.

ఒకటో వార్డు కౌన్సిలర్‌ ఏకగ్రీవ ఎన్నిక

రాయదుర్గంటౌన, నవంబరు 8: పురపాలక సంఘం పరిధిలోని ఒకటో వార్డు కౌన్సిలర్‌గా వైసీపీ అభ్యర్థి భీమనపల్లి నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా సోమవారం తెలిపారు. వార్డు కౌన్సిలర్‌ ఎన్నికకు వైసీపీ అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయగా గంగమ్మ, రాజేశ్వరిు ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో బరిలో ఒకే అభ్యర్థి వుండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. 


 రాయదుర్గం రూరల్‌: మండలంలోని 74 ఉడేగోళం పంచాయతీ 5వ వార్డు మెంబర్‌ స్థానం ఎన్నికకు మూడు నామినేషన్లు దాఖలు కాగా, సోమవారం ఒక నామినేషన ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారి కొండయ్య తెలిపారు. సోమశేఖర్‌ తన నామినేషనను ఉపసంహరించుకోవడంతో మల్లేశప్ప, రామలక్ష్మీ ఎన్నికల బరిలో నిలిచారన్నారు. డీ కొండాపురం 2వ వార్డు ఎన్నికకు కెంచమ్మ మాత్రమే నామినేషను దాఖలు చేయగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. 


తిరస్కరించిన నామినేషన ఆమోదం 

కళ్యాణదుర్గం, నవంబరు8: శెట్టూరు మండలం కైరేవు గ్రామ పంచాయతీ ఉప ఎ న్నికల్లో సర్పంచు స్థానానికి తిమ్మరాజులు దాఖలు చేసిన నామినేషనను అధికారులు ఎట్ట కేలకు అంగీకరించారు. ఈమేరకు సోమవారం ఆర్డీఓ నిశాంతరెడ్డి తెలిపారు. స్ర్కూట్నీలో భాగంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఓబులేష్‌ తిరస్కరించారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తిమ్మరాజులు వార్డు మెంబరుగా పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో ఎన్నికలకు సంబంధించిన లెక్కల రికార్డులు సమర్పించలేదనే కారణంతో నామినేషన దాఖలను తిరస్కరించారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు ఆర్జీ శివశంకర్‌, మారుతిచౌదరిలు కలెక్టర్‌, డీపీఓలకు ఫిర్యాదు చేశారు. గత  పంచాయతీ ఎన్నికల్లో రికార్డులను సమర్పించినట్లు తే టతెల్లమైంది. దీనిపై ఆదివారం ఆర్డీఓకు న్యాయవాదులతో కలిసి అపిల్‌చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి నామినేషనను అంగీకరిస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు. 


సర్పంచ అభ్యర్థిపై కేసు నమోదు 

శెట్టూరు, నవంబరు8: మండలంలోని కైరేవు గ్రామ సర్పంచు అభ్యర్థి తిమ్మరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివ సోమవారం తెలిపారు. సోమవారం తెల్లవారుజాము న తిమ్మరాజు ఇంటి పరిసరాల్లో కర్ణాటక మద్యం వుందని అనుమానాస్పద కేసు నమోదు చేశామన్నారు. గతంలో కూడా తిమ్మరాజుపై మద్యం అక్రమ రవాణా కేసులు ఉన్నట్లు తె లిపారు. విచారణ చేపట్టి చర్యలు చేపడతామన్నారు. 


Updated Date - 2021-11-09T06:47:54+05:30 IST