దూసుకొస్తోనన ఒమైక్రాన

ABN , First Publish Date - 2021-12-30T06:49:40+05:30 IST

కరోనా థర్డ్‌వేవ్‌ దూసుకొస్తోంది. ఈసారి ఒమైక్రాన వైరస్‌ పేరుతో విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా జిల్లాలో అడుగు పెట్టింది. గత నాలుగు రోజుల కిందట యూకే నుంచి బెంగళూరు మీదుగా అనంతపురం వచ్చిన ఓ వ్యక్తికి ఒమైక్రాన నిర్ధారణ అయింది.

దూసుకొస్తోనన ఒమైక్రాన

అనంతలో మరో రెండు కేసులు

అమెరికా నుంచి వచ్చిన యువకుడికి నిర్ధారణ

ఆయన కాంటాక్ట్‌తో మరో అమ్మాయికి వైరస్‌

మూడుకు చేరిన బాధితులు


అనంతపురం వైద్యం, డిసెంబరు29: కరోనా థర్డ్‌వేవ్‌ దూసుకొస్తోంది. ఈసారి ఒమైక్రాన వైరస్‌ పేరుతో విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా జిల్లాలో అడుగు పెట్టింది. గత నాలుగు రోజుల కిందట యూకే నుంచి బెంగళూరు మీదుగా అనంతపురం వచ్చిన ఓ వ్యక్తికి ఒమైక్రాన నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో కలకలం రేపింది. బుధవారం జిల్లాలో మరో రెండు ఒమైక్రాన పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అమెరికా నుంచి ఈనెల 18న జిల్లాకేంద్రానికి వచ్చిన 22 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ కుటుంబంలోని కాంటాక్ట్‌ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. అందులో మరో 17 ఏళ్ల అమ్మాయికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ ఇద్దరి నమూనాలను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపారు. అక్కడ ఇద్దరికి ఒమైక్రాన వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర, జిల్లా వైద్యశాఖ అధికారులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. గత రెండేళ్లుగా కరోనాతో అల్లాడిన ప్రజలు  వైరస్‌ తీవ్రత తగ్గటంతో ఇటీవల స్వీయరక్షణ చర్యలకు నీళ్లొదిలి రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నారు. భౌతికదూరం, మాస్క్‌లు ధరించడంలో సైతం అశ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పుడు ఒమైక్రాన కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ప్రధానంగా అనంతపురం నగరంలోనే విదేశాల  నుంచి వచ్చిన ముగ్గురికి ఒమైక్రాన నిర్ధారణ కావడం నగర ప్రజలను మరింత టెన్షన పెడుతోంది. 


మరో 9 కరోనా కేసులు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. కొత్త మరణాలు నమోదు కాలే దు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 158247 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 157133 మంది ఆరోగ్యంగా కోలుకోగా 1093 మంది మరణించారు. ప్రస్తుతం 21 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 


థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం

జేసీ సిరి


జిల్లాలో కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సమష్టిగా పోరాటం చేద్దామని జేసీ డాక్టర్‌ సిరి సూచించారు. బుధవారం జిల్లా పరిషత సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల నోడల్‌ ఆఫీసర్లు,  వైద్యాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జనవరి 15 తర్వాత కొత్త వేరియంట్‌ ఒమైక్రాన వ్యాప్తి పెరిగితే అందుకు అవసర మైన ఏర్పాట్లు చేసుకుందామన్నారు. గతంలో రెండో వేవ్‌ లో జిల్లాలో గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులన్నిటినీ మళ్లీ పరిశీలించి ఆయా ఆస్పత్రులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా ఆక్సిజన, అవసరమైన సిలిండ ర్లు, పడకలు, ఆక్సిజన మాస్క్‌లు, శానిటేషనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆక్సిజన ప్లాంట్‌లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వైద్యాధికారులు, సూపరింటెండెంట్‌లు, నోడల్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన ఆస్పత్రులను సం దర్శించి  అన్ని ఏర్పాట్లు చేయాలని జేసీ సిరి ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథంతో పాటు పలువురు వైద్యులు, ఆస్పత్రుల నోడల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-30T06:49:40+05:30 IST