అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2021-10-07T06:43:04+05:30 IST

అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ సెల్వరాజన్‌ పేర్కొన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నల్లచెరువులో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌

గాండ్లపెంట,  అక్టోబరు 6: అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ సెల్వరాజన్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రెక్కమాను గ్రామ సచివాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులు అయిన మహిళా పోలీసులు, విలేజ్‌ అసిస్టెంట్‌ మరియు పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లు, డిజిటల్‌ అసిస్టెంట్‌లు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌ ఆరాతీశారు. అనం తరం పాల ఉత్పత్తి యజమానుల వివరాలను నమోదు ప్రక్రియను వలం టీర్లతో అడిగి తెలుసుకున్నారు. పాల ఉత్పత్తిదారుల వివరాలను నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని, జిల్లాలో ఈ నెల 22 న అమూల్‌ పాలకేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ జేడీ సుబ్రమణ్యం, ఆర్డీఓ వెంకటరెడ్డి, ఏడీఏ సత్యనా రాయణ, తహసీల్దార్‌ వెంకటరమణ, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ సునీత, పలు శాఖల అఽధికారులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 

నల్లచెరువు: మండలం జోగన్నపేట గ్రామంలో జగనన్న పాలవె ల్లువలో భాగంగా వలంటీర్ల ద్వారా చేపడుతున్న పాల ఉత్పత్తిదా రుల సర్వే ప్రక్రియను కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ బుధవారం పరి శీలించారు. పాల ఉత్పత్తిదారుల సర్వేను వేగవంతం చేయాలని సంబంధిత అఽధికా రులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎం అగ్రహారంలో నిర్మా ణం పూర్తి చేసుకున్న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అధిక మంది రైతులు తహసీల్దార్‌ జిలానీపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ ప్లాంట్‌ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. రైతులు సర్వే కూడా జరుగుతోందని తెలిపారు. రెవెన్యూ సమస్యలు ఎక్కు వగా ఉండటంతో అధిక మంది రైతులు తహసీల్దార్‌పై ఫిర్యాదు చేశార న్నారు. మండలంలో ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్‌లో రిజక్ట్‌ అవుతు న్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. 40 రోజులలోపు సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌ను హెచ్చరించారు. రైతుభరోసా రాని రైతుల కు న్యాయం చేయాలని రైతు సంఘం నాయకులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ వెంకటరెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ సుబ్రమణ్యం, ఎస్‌ఓ అన్నాదొర, ఎంపీడీఓ శకుంతల, ఏడీ సత్యనా రాయణ, సర్పంచు విష్ణువర్ధన్‌, ఎంపీపీ రమణారెడ్డి, జడ్పీటీసీ అనిత, సీఐ టీయూ నాయకులు సాంబశివ, రైతు సంఘం నాయకులు శ్రీరాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-07T06:43:04+05:30 IST