పక్కదారి పడుతోన్న పౌష్టికాహారం

ABN , First Publish Date - 2021-05-20T06:19:18+05:30 IST

కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పం పడానికి తల్లిదం డ్రులు నిరాకరిస్తున్నారు.

పక్కదారి పడుతోన్న పౌష్టికాహారం
పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రం (ఫైల్‌ఫొటో)



అంగన్‌వాడీ కేంద్రాలకు పంపాలంటే

చిన్నారుల తల్లిదండ్రుల్లో కరోనా భయం

గ్రామాల్లో అందించని పౌష్టికాహారం

అధికారుల పర్యవేక్షణ లోపం

కొందరు సిబ్బంది ఇష్టారాజ్యం


ధర్మవరంఅర్బన్‌, మే 19 : కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పం పడానికి తల్లిదం డ్రులు నిరాకరిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు సిబ్బంది పౌష్టికాహారం పంపిణీ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్వ ప్రాథమికపాఠశాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పర్యవేక్షకులు చెబుతున్నా కొన్ని కేంద్రాల్లో అమలు కావడం లేదనే వాదనలు విని పిస్తున్నా యి. పిల్లలందరూ గుంపులుగా ఒకేచోట కూర్చోవడం, మాస్కు లు ధరించక పోవడం వంటివి తల్లిదం డ్రుల్లో అభద్రత భావాన్ని కలిగిస్తున్నాయి. 1వతర గతి నుండి 9వ తరగతి వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అం గన్‌ వాడీ కేంద్రాలకు మాత్రం సెలవులు  ప్రకటించలేదు. ధర్మవరం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ధర్మ వరం పట్టణ, రూరల్‌, బత్తలపల్లి, తాడిమర్రి మండల ాల్లో 298 అంగ న్‌వాడీ కేంద్రాలు, 62 మినీ అం గన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 17,167 పిల్లలున్నారు. వీరితో పాటు గర్భవతులు 2253, బాలింతలు 1911 మంది ఉన్నారు. వీరు అవగాహన కార్యక్రమాలు, పౌష్టిక ఆహారం కోసం వస్తుంటారు. కరోనా దృష్ట్యా వారికి ఇంటికే పౌష్టికాహారం స రఫరా చేస్తున్నారు. చిన్నారులు మాత్రం కేంద్రాలకు రావాల్సి వస్తోంది. అక్క డక్కడ కేంద్రాలకు రోజువా రీ వచ్చే చిన్నారుల సంఖ్య 15 నుండి 20మంది వరకు ఉంటోంది. దీంతో వారికి ప్రభుత్వమిచ్చే పౌష్టికాహా రాన్ని కొందరు కార్యకర్తలు, ఆయాల ద్వారా ఇళ్లకే పంపిణీ చేస్తున్నారు.


కరోనా కష్టకాలంలోనూ కక్కుర్తి

 చిన్నారులకు అందజేసే పౌష్టికాహారం విషయంలో కొందరు సిబ్బంది పంపిణీ చేయకుండా కక్కుర్తి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల పర్య వేక్షణ పడకేయడంతో అక్రమా లకు పాల్పడుతున్న సిబ్బందిని అడిగేనా థుడే కరువయ్యారు. ఐసీడీఎస్‌ పర్యవేక్షకులు మండల కేంద్రాలకే పరిమితం కావడంతో మారుమూల గ్రామాల్లోని కేంద్రాల్లోపౌష్టిక ఆహారం పక్కదారి పడుతోందనే ఆరోణలు వినిపిస్తున్నాయి. తమ పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టిక ఆహారం సక్రమంగా అందడం లేదని, సిబ్బందిని అడిగినా అధికారులకు తెలిపినా సమాధానమే కరువైందని బాధితులు వాపోతున్నారు. 


తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం.. : వరలక్ష్మీ, సీడీపీఓ, ధర్మవరం

అంగన్‌వాడీకేంద్రంలో ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారం పక్కదరి పడుతు న్నట్టు తమదృష్టికి రాలేదు. అయితే ధర్మవరం ప్రాజెక్టు పరిధిలో ఎక్కడైనా పౌష్టిక ఆహారం పక్కదారిపడుతున్నట్టు తమ దృష్టికి తెస్తే వెంటనే చర్యలు చేపడుతాం.


Updated Date - 2021-05-20T06:19:18+05:30 IST