గిడుగు రామమూర్తి సాహితీ పురస్కారానికి ఎంపిక

ABN , First Publish Date - 2021-08-28T06:01:58+05:30 IST

గిడుగు రామమూర్తి తెలుగు సాహితీ పురస్కారానికి జాబిలి చాంద్‌బాష రచించిన ‘మట్టిని ముద్దాడిన మనిషి’ కవితాసంపుటిని ఎంపిక చేశారు.

గిడుగు రామమూర్తి సాహితీ పురస్కారానికి ఎంపిక
జాబిలి చాంద్‌బాషా

రొద్దం/పెనుకొండ, ఆగస్టు 27: గిడుగు రామమూర్తి తెలుగు సాహితీ పురస్కారానికి జాబిలి చాంద్‌బాష రచించిన ‘మట్టిని ముద్దాడిన మనిషి’ కవితాసంపుటిని ఎంపిక చేశారు. గిడుగు రామమూర్తిఫౌండేషన జాబిలి చాంద్‌బాషను సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈనెల 29న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవార్డులు అందజేస్తున్నట్లు చాంద్‌బాష తెలిపారు. 13ఏళ్లుగా వేకువ సేవా సంస్థ అనంత సాహితీఅకాడమి జాబిలి సాహితీ మాసపత్రిక ద్వారా సేవ చేసినందుకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.



Updated Date - 2021-08-28T06:01:58+05:30 IST