వైసీపీ దౌర్జన్యాలకు బెదిరేది లేదు: ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-03-24T06:21:05+05:30 IST

వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు బెదిరేది లేదని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్గా రియాజుల్‌ హసన్‌ పేర్కొన్నారు.

వైసీపీ దౌర్జన్యాలకు బెదిరేది లేదు: ఎమ్మెల్సీ
సమావేశంలో మాట్లాడుతున్న ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్గా రియాజుల్‌ హసన్‌

రాయదుర్గంటౌన్‌, మార్చి 23 : వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు బెదిరేది లేదని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్గా రియాజుల్‌ హసన్‌ పేర్కొన్నారు. పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితా ల సందర్భంగా 27వ వార్డులో జరిగిన గొడవపై ఆరాతీసేందుకు ఆపార్టీ అధినేత అసుదుద్దీన్‌ ఓవైసీ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక  కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ నాయకులు ఎంఐఎం అభ్యర్థి కుటుంబంపై చేసిన దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడారు. మైనార్టీలు, దళితుల హక్కుల సాధన కో సం ఎంఐఎం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందని విమర్శించారు. మైనార్టీల సంక్షేమానికి పాటుపడిన దాఖలాలు లే వని పేర్కొన్నారు. ఎంఐఎం కౌన్సిలర్‌ అభ్యర్థి కుటుంబంపై దాడి చేసిన వారిపై పోలీసులు చ ర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో రాయదుర్గం ప్రాంతంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయిస్తామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ కార్పొరేటర్‌ ముంతాజ్‌ అహ్మద్‌, ఎంఐఎం జిల్లా నాయకులు దాదాపీర్‌, అల్లా బకాష్‌, స్థానిక నాయకులు బ్రెడ్‌ సర్మస్‌, అబ్దుల్లా, సైనూద్‌, నబీ, మున్నా పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-24T06:21:05+05:30 IST