కొనేవారు లేక.. లబోదిబోమంటున్న రైతులు
ABN , First Publish Date - 2021-05-05T06:37:45+05:30 IST
వేరుశనగ 18-12 రకం సాగుచేసి మంది దిగుబడి సాధించినా కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు.

18-12 రకం వేరుశనగ సాగుతో నష్టాలు
ఓబుళదేవరచెరువు , మే 4 : వేరుశనగ 18-12 రకం సాగుచేసి మంది దిగుబడి సాధించినా కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు. మండలంలోని తంగేడుకుంటకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు కే నంజుండప్ప రెండు ఎకరాల్లో 18-12 రకం వేరుశనగను సాగుచేశారు. వీటి కోసం రూ. లక్ష వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. వేరుశనగ మొక్కకు 50 నుండి 60 కా యలు వచ్చాయి. దిగుబడి బాగున్నప్పటికీ కనీసం అడిగే వారు లేక కాయ లను విడిపించి పడిగాపులు కాయాల్సి వస్తోందని వారు వాపోయారు. మం డల వ్యాప్తంగా దాదాపు వందల ఎకరాల్లో ఈ విత్తనాన్ని సాగుచేసి రైతులు అమ్ముకోలేక కల్లాల్లోనే నిల్వ ఉంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.