63,344 మందికి రూ.55.90కోట్ల లబ్ధి

ABN , First Publish Date - 2021-12-29T05:14:52+05:30 IST

జిల్లాలో వి విధ ప్రభుత్వ పథకాల ద్వారా 63,344 మంది లబ్ధిదారులకు రూ.55.90 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు ఇనచార్జ్‌ కలెక్టర్‌ నిశాంతకుమార్‌ పేర్కొన్నారు.

63,344 మందికి రూ.55.90కోట్ల లబ్ధి

అర్హులైనా.. పథకాలు దక్కని వారికి నగదు పంపిణీ

ఇనచార్జ్‌ కలెక్టర్‌ నిశాంతకుమార్‌

అనంతపురం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వి విధ ప్రభుత్వ పథకాల ద్వారా 63,344 మంది లబ్ధిదారులకు రూ.55.90 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు ఇనచార్జ్‌ కలెక్టర్‌ నిశాంతకుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ముఖ్యమం త్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుం చి వీడియో కాన్ఫరెన్స ద్వారా నవరత్నాల లబ్ధిదారులకు ద్వై వార్షిక నగదు పంపిణీ చేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్సకు కలెక్టరేట్‌ నుంచి ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఇనచార్జ్‌ కలెక్టర్‌ నిశాంతకుమార్‌, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ హాజరయ్యారు. సీఎం వీడి యో కాన్ఫరెన్స అనంతరం ఇనచార్జ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్ర భుత్వ పథకాలకు అర్హులై ఉండి ఏ కారణంతోనైనా సంక్షేమ ప థకాలు అందని వారికి నగదు పంపిణీ చేశామన్నారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలు వైఎస్సార్‌ నేతన్న నేస్తం, వాహనమిత్ర, కాపు నేస్తం, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, రైతులకు సున్నావడ్డీ పథకాల కింద నగదు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. ఇందులో భాగంగానే.. జిల్లాలో వై ఎస్సార్‌ నేతన్న నేస్తం కింద 293 మంది లబ్ధిదారులకు రూ. 70.32 లక్షలు, వాహనమిత్ర కింద 325 మందికి రూ.32.50 లక్ష లు, కాపు నేస్తం కింద 577 మందికి రూ.86.55 లక్షలు లబ్ధి కలిగిందన్నారు. వైఎస్సార్‌ చేయూత కింద 24,208 మందికి రూ.45. 39 కోట్లు, ఆసరా 75 స్వయం సహాయక సంఘాలకు రూ.54.08 లక్షలు, వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద 2123 స్వయం సహాయక సంఘాలకు రూ.2.03 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. వైఎస్సార్‌ సున్నావడ్డీ పంపిణీ కింద 10270 మంది రైతులకు రూ. 84 లక్షలు, జగనన్న విద్యాదీవెన కింద 2451 మందికి రూ.1.71 కో ట్లు, జగనన్న వసతి దీవెన కింద 3760 మందికి రూ.3.50 లక్ష లు లబ్ధి చేకూరిందన్నారు. అనంతరం లబ్ధిదారులకు రూ.55.90 కోట్ల మెగా చెక్కును ప్రభుత్వ విప్‌, ఇనచార్జ్‌ కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన చైర్మన మీసాల రంగన్న, రాష్ట్ర నాటక అకాడమీ చైర్‌పర్సన హ రిత, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన చైర్‌పర్సన నళిని, జేసీలు సిరి, గంగాధర్‌ గౌడ్‌, నగర మేయర్‌ వసీం, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ విశ్వమోహనరెడ్డి, సెరికల్చర్‌ ఏడీ శాంతి, డీఎ్‌సఓ రఘురామిరెడ్డి, బీసీ కార్పొరేషన ఈడీ నాగముని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-29T05:14:52+05:30 IST