నాగపూర్‌ కంపెనీ కేసు సీఐడీకి : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-07-12T06:03:55+05:30 IST

దాదాపు రూ. వంద కోట్లు ప్రజల నుంచి వసూళ్లు చేసుకొని.. ఉడాయించిన నాగపూర్‌ కంపెనీ కేసును సీఐడీకి అప్పగించినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత ఓ ప్రకటనలో తెలిపారు.

నాగపూర్‌ కంపెనీ కేసు సీఐడీకి : డీఎస్పీ

ధర్మవరంరూరల్‌, జూలై 11: దాదాపు రూ. వంద కోట్లు ప్రజల నుంచి వసూళ్లు చేసుకొని.. ఉడాయించిన నాగపూర్‌ కంపెనీ కేసును సీఐడీకి అప్పగించినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత ఓ ప్రకటనలో తెలిపారు. రామగిరి మండలం వెంకటాపురానికి చెందిన సోదరులు కడియాల సునీల్‌, కడియాల సంతో్‌ష ఈబీఐడీడీ నాగపూర్‌ కంపెనీ పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపి జిల్లా ప్రజల నుంచి రూ. వంద కోట్లుకు పైగా వసూళ్లు చేసుకొని ఉడాయించిన సంగతి తెలిసిందే. వసంతపురం గ్రామానికి చెందిన బాబుల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఆ కంపె నీ ఏజెంట్లు చింతలపల్లికి చెందిన  జాస్తి సుధాకర్‌ నాయుడు, పతకమూరి పుల్లానాయుడు, వడ్లమూడి విజయ్‌ భాస్కర్‌, మహేంద్రచౌదరిలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమో దు చేశారు. నిందితుల నుంచి కంప్యూటర్‌, ల్యాప్‌ట్యాప్‌, హార్డ్‌డి్‌స్కలతో పాటు వివిధ రసీదులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరగా చేధించడంలో భాగంగా సీఐడీకి బదిలీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. 

Updated Date - 2021-07-12T06:03:55+05:30 IST